దేవుని అత్యంత విజయవంతమైన వెనుకడుగు

షేర్ చెయ్యండి:

“అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను”. (ఫిలిప్పీయులు 2:9–11)

క్రిస్మస్ దేవుని అత్యంత విజయవంతమైన వెనుకడుగు ప్రారంభమైన రోజు. ఆయన ఎప్పుడూ తన శక్తిని పరాజయాలుగా కనపడే వాటి ద్వారా చూపించడంలో ఆనందిస్తాడు. ఆయన వ్యూహాత్మక విజయాలను సాధించడానికి కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతారు.

పాత నిబంధనలో, యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులలో ఒకరైన యోసేపు తన కలలో కీర్తి మరియు శక్తి వాగ్దానం చేయబడ్డాడు (ఆదికాండము 37:5-11). కానీ ఆ విజయం సాధించాలంటే అతడు ఈజిప్టులో బానిసగా మారాల్సి వచ్చింది. మరియు, అది సరిపోదన్నట్లుగా, అతని చిత్తశుద్ధి కారణంగా అతని పరిస్థితులు మెరుగుపడినప్పుడు, అతను బానిస కంటే అధ్వాన్నంగా తయారయ్యాడు: ఖైదీ.

అయితే అంతా వ్యూహంలా జరిగింది. దేవుడు తన మంచి కోసం మరియు అతని కుటుంబం యొక్క మంచి కోసం మరియు చివరికి మొత్తం ప్రపంచ మంచి కోసం ప్రణాళిక చేశాడు! అక్కడ జైలులో ఆయన ఫరో యొక్క భక్ష్యకారుడును కలుసుకున్నాడు. అతను చివరికి అతన్ని ఐగుప్తు ఫరో వద్దకు తీసుకువచ్చాడు. చివరకు అతని కల నెరవేరింది. అతని సోదరులు అతని ముందు నమస్కరించారు, మరియు అతను వారిని ఆకలి నుండి రక్షించాడు. కీర్తిని పొందడానికి గొప్ప అసాధ్యమైన మార్గం కదా ఇది!

కానీ అది దేవుని మార్గం – ఆయన కుమారునికి కూడా ఇలాగే జరిగింది. తనను తాను ఖాళీ చేసుకొని దాసుని రూపం దాల్చాడు. బానిస కంటే అధ్వాన్నంగా – ఖైదీగా – శిలువ వేయబడ్డాడు. అయితే యోసేపులాగే ఆయన తన యథార్థతను కాపాడుకున్నాడు. “దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులు 2:9-10).

మరియు మనకు కూడా ఇదే దేవుని మార్గం. రోమా ​​8:17 లో చెప్పినట్లు మనం ఆయనతో శ్రమపడుతుంటే – మనకు మహిమ వాగ్దానం చేయబడింది. పైకి వెళ్ళే మార్గం క్రిందికి ఉంది. ముందుకు వెళ్ళే మార్గం వెనుకకు ఉంది. విజయానికి మార్గం దైవికంగా నియమించబడిన ఓటములు. అవి ఎప్పుడూ పరాజయాలుగా కనిపిస్తాయి.

అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా యోసేపు మరియు యేసు నుండి మనము ఈ విషయం నేర్చుకోవచ్చు: సాతాను మరియు పాపాత్ములు చెడు కోసం ఉద్దేశించినది, “దేవుడు దానిని మంచి కోసం ఉద్దేశించాడు!” (ఆదికాండము 50:20).

దేవునికి భయపడే పరిశుద్ధులారా నూతనమైన ధైర్యం తెచ్చుకోండి
మీరు ఎంతో భయపడే మేఘాలు
కరుణతో నిండిపోయి ఉన్నాయి
మీ తలపై ఆశీర్వాదాలుగా చీలిపోతాయి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...