ఆధ్యాత్మిక వరాలలో దేవుని కృప

షేర్ చెయ్యండి:

దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. (1 పేతురు 4:10) 

మనం ఆధ్యాత్మిక వరాలను ఉపయోగించినప్పుడు, మనం కృపను సంరక్షిస్తున్నాం, అంటే నిన్నటి కృపను కాదు గాని నేడు అందుబాటులో ఉండే కృపను, అవసరమైన ప్రతి క్షణానికి కావాల్సిన కృపను సంరక్షిస్తున్నాం. భవిష్యత్తుకు సంబంధించిన కృప అనేది “మార్పు చెందే కృప.” ఇది అనేక రకాలైన రంగుల ద్వారా, ఆకారాల ద్వారా, సైజుల ద్వారా మన వద్దకు వస్తుంది. శరీరంలో ఆధ్యాత్మిక వరాలు వైవిధ్యంగా ఉన్నాయనడానికి ఇదొక కారణం. మీ జీవితంలో ఉండే దేవుని వరాలు దైవిక మహిమ కిరణాలను వెదజల్లుతాయి.

క్రీస్తు శరీరములో ఎన్ని అవసరతలున్నాయో అన్ని భవిష్యత్తు కృపలు ఉన్నాయి, ఇంకా అత్యధికంగా ఉన్నాయి. ఆ అవసరాలకు దేవుని భవిష్యత్తుకు సంబంధించిన కృపను అందించి, పంపిణీ చేయడమే ఆధ్యాత్మిక వరాలకున్న ఉద్దేశం.

అయితే, “భవిష్యత్తుకు సంబంధించిన కృపను సూచించడానికి పేతురును ఎందుకు ఎంచుకున్నారు? అప్పటికే చేతిలో ఉన్నటువంటి గృహ నిర్వాహకత్వపు బాధ్యత గృహమును నిర్వహించలేదా? అని చాలామంది అడుగుతుంటారు.

భవిష్యత్తుకు సంబంధించిన కృపను సూచించడానికి నేను పేతురు పత్రికని తీసుకోవడానికిగల ముఖ్య కారణం ఏంటంటే ఇది ఎలా పని చేస్తుందనే విషయాన్ని ఆ తర్వాత వచనం వివరిస్తోంది, అక్కడ భవిష్యత్తు కృప అందించేవాటికి సంబంధించిన వచనం ఉంది. “ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును.” (1 పేతురు 4:11). ఇక్కడ “అనుగ్రహించు,” అని ఉంది గాని “అనుగ్రహించిన” అని లేదు గమనించండి. మీరు ఉపచారము చేసినప్పుడు, మీరు చేయవలసింది చేయడానికి దేవుని కృప అందించు శక్తిలోనే ఉపచారము చేయాలి.

రేపటి రోజున ఎవరికైనా సేవ చేయడానికి మీ ఆధ్యాత్మిక వరాన్ని పూర్తిగా ఉపయోగించినప్పుడు, రేపటి రోజున “దేవుడు అనుగ్రహించు బలము ద్వారానే” మీరు ఆ వ్యక్తికి సేవ చేస్తున్నారు, అంటే అనుగ్రహించబడేది రేపటి రోజున గాని ఈ రోజు కాదు. “… నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును” (ద్వితీయో 33:25).

ప్రతి రోజుకు, ప్రతి క్షణానికి, మనం చేసే పరిచర్యలో కావాల్సిన “బలాన్ని” దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిరంతరం, తరగనటువంటి శక్తిని అందించుట ద్వారా మహిమ కలుగుతుంది కాబట్టి ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. “ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది (ఉపచారము) చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును.”

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...