మలుపులలో దేవుని రూపకల్పన

మలుపులలో దేవుని రూపకల్పన

షేర్ చెయ్యండి:

“మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి”. (కొలొస్స 3:17)

మీరు పోగొట్టుకున్న దాని కోసం, మీకు అత్యవసరమైన దాని కోసం మీరు వేదకరాని స్థలంలో వెదకుచున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడోనని మీరెప్పుడైనా ఆలోచించారా? అది ఎక్కడుందో ఆయనకి ఖచ్చితంగా తెలిసినప్పటికీ మీరు వెదకకూడని చోట వెదికేలా చేస్తున్నాడు.

డిజైరింగ్ గాడ్ (Desiring God) అనే నా పుస్తకం యొక్క క్రొత్త ఎడిషన్ కోసం నాకు ఒక కోటేషన్ అవసరమయ్యింది. దానిని రిచర్డ్ వుర్బ్రాండ్ లో చదివానని నాకు తెలుసు. అది దైనందిన భక్తికి సంబంధించి ఆయన వ్రాసిన రీచింగ్ టువర్డ్ ద హైట్స్ (Reaching Toward the Heights) అనే పుస్తకంలో ఉందని నేననుకున్నాను. ఆ పుస్తకంలో ఉన్న పేజీలకు కుడివైపున నేను దానిని చూశాను గాని నాకు అది దొరకలేదు.

అయితే, నేను వెదుకుతున్నప్పుడు, నవంబర్ 30న ఆయన వ్రాసిన దైనందిన భక్తి వ్యాసాన్ని బాగా ఆస్వాదించాను. నేను దానిని చదువుతున్నప్పుడు, “ఇందుకే ‘వెదకకూడని’ స్థలములో నాకు కావాల్సిన కొటేషన్ కోసం వెదికేటట్లు ప్రభువు చేశాడు” అని నేనన్నాను. యేసు పేరట మనం చేసేది ఏదైనా వ్యర్థంగా పోదని పక్కాగా చెప్పబడిన ఒక కథ అక్కడ ఉంది, సరిగాని స్థలంలో కొటేషన్ కోసం వెతికినప్పటికీ వ్యర్థంగా పోదు. నేనేమి చదివానో ఇక్కడ ఉంది చూడండి:

వికలాంగులైన పిల్లల గృహంలో కేథరిన్ ఇరవై ఏళ్లపాటు పోషించబడింది. ఆ చిన్నది [మానసిక వికలాంగురాలు] మొదటి నుండి ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఆ అమ్మాయి కేవలం మానసిక సమస్యతో జీవితాన్ని గడిపేది. ఆమె నిశ్శబ్దంగా గోడల వైపు చూసేది లేదా అర్థం పర్థం లేనటువంటి కదలికలు చేసేది. తన జీవితమంతా తినడం, త్రాగటం, నిద్రపోవడం మాత్రమే ఉండేవి. తన చుట్టూ జరిగే విషయాల్లో ఆమె అస్సలు పాల్గొనడం లేదనిపించింది. ఒక కాలును తీసేయాల్సి వచ్చింది. సిబ్బంది అంతా కేథరిన్ కి  మంచి జరగాలని కోరుకున్నారు, మరియు ప్రభువు త్వరలోనే ఆమెను తన వద్దకు తీసుకువెళతాడని కూడా ఆశించారు.

డాక్టర్ ఓ రోజున డైరెక్టర్ ని త్వరగా రమ్మని పిలిచాడు. కేథరిన్ చనిపోతోంది. వారిద్దరూ గదిలోకి ప్రవేశించగానే తమను తామే  నమ్మలేకపోయారు. కేథరిన్ తను విన్న, ఎన్నుకున్న, చావు మంచాల కోసం అనువైన కొన్ని క్రైస్తవ కీర్తనలను పాడుతోంది, “ఆత్మ తన పితృభూమిని, దాని విశ్రాంతిని ఎక్కడ కనుగొంటుంది?” అనే జర్మన్ పాటను ఆమె పదేపదే పాడుతూ ఉంది. రూపాంతరం చెందిన ముఖంతో అరగంట పాటు పాడిన తర్వాత ఆమె నిశ్శబ్దంగా కన్ను మూసింది. (ది బెస్ట్ ఈజ్ టు కమ్ (The Best Is Still to Come) నుండి తీసుకోబడింది, వూపర్టల్: సోన్నే ఉండ్ షిల్డ్).

క్రీస్తు పేరట జరిగించబడింది ఏదైనా నిజంగా వృధా అయ్యిందా?

నాకు అవసరమైన దాని కోసం విసుగుతో నేను చేసిన వ్యర్థమైన పరిశోధన వృధా కాలేదు. వికలాంగురాలైన ఈ చిన్నారికి పాడటం వృధా కాలేదు. మరియు వేదనతో కూడిన ప్రణాళిక లేనటువంటి ప్రయాణం వృథా కాదు, ప్రభువు చేసే ఊహించని పని కోసం ఆయన వైపు చూస్తే సరిపోదు గాని ఆయన పేరట ప్రతిదీ చేయండి (కొలొస్స 3:17).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...