దేవుని ఉత్తమ వాగ్దానం

షేర్ చెయ్యండి:

“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమా 8:32)

భవిష్యత్తు కృపకు సంబంధించిన దేవుని అత్యంత ఉత్తమమైన వాగ్దానం రోమా 8:32వ వచనంలో ఉంది. ఇది నాకు అత్యంత శ్రేష్టమైన బైబిల్ వచనం. ఇది అంతగా ఇష్టమవ్వడానికి గల కారణం ఏంటంటే అందులో ఉన్న వాగ్దానం నా జీవితంలోను, నేను చేస్తున్న సేవలోను వాస్తవంగా ఎదురయ్యే ప్రతి మలుపులో నాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఈ వాగ్దానం నా జీవితంలో ఏ పరిస్థితులలోను అసంబంధంగా ఉండలేదు, ఉండబోదు.

అన్నింటినీ కలిగియున్న ఈ వాగ్దానం మాత్రమే ఈ వచనాన్ని అంత ప్రత్యేకమైన వచనంగా ఉంచకపోవచ్చు. అలాంటి ఉత్తమ వాగ్దానాలు చాలానే ఉన్నాయి:“యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు” (కీర్తన 84:11). “కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు”(1 కొరింథీ 3:21-22). ఈ వాగ్దానాలకున్న అద్భుతమైన లోతును మరియు విస్తీర్ణతను వివరించడం చాలా కష్టం.

అయితే, రోమా 8:32వ వచనాన్ని విశేషమైన వచనంగా చేసేదేమంటే వాగ్దానం వెనక ఉన్నటువంటి తార్కికం, ఇది ఎంత బలంగా ఉంటుందంటే, అంతులేని మెచ్చుకోదగిన తన కుమారుని కోసం దేవుడు దృఢమైన మరియు కదలని ప్రేమను కలిగి ఉన్నంత బలమైనదిగా కదలనిదిగా ఉంటుంది. 

రోమా 8:32వ వచనంలో ఏ విధంగానూ వాగ్దానం విఫలం కాని విధంగా, బలమైన, దృఢమైన, భద్రమైన, సురక్షితమైన భరోసాను మరియు పునాదిని కలిగి ఉంది. గొప్ప అలజడి కలిగే సందర్భాలలో ఎల్లప్పుడూ ఉండే శక్తిని కలిగిస్తుంది. ఏదేమైనా, ఏది నిరాశ పరచినా, ఏది విఫలమైనా, భవిష్యత్తు కృపకు సంబంధించిన సమస్తాన్ని కలిగి ఉండే ఈ వాగ్దానం ఎప్పటికీ విఫలం కాదు.

“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు…” అనే ఈ మాటే పునాది. ఇది నిజమైతే, అప్పుడు, దేవుడు తన కుమారుణ్ణి ఎవరి కోసమైతే ఇచ్చాడో వారందరికీ ఆయన సమస్తాన్ని ఇస్తాడని సంపూర్ణ నిశ్చయతతో  పరలోకపు తార్కికం చెప్తోంది!

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...