దేవుడు ఇతరుల ద్వారా మనలను బలపరుస్తాడు

దేవుడు ఇతరుల ద్వారా మనలను బలపరుస్తాడు

షేర్ చెయ్యండి:

“సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.” (లూకా 22:31–32)

మిగతా పది మంది అపొస్తలుల సంగతేంటి (యూదాకాకుండా)?

సాతాను వారిని కూడా జల్లెడ పట్టబోతున్నాడు. యేసు వారి కొరకు ప్రార్థించాడా?

అవును ఆయన ప్రార్థన చేశాడు. కానీ ఆయన పేతురును కాపాడిన విధంగానే వారి విశ్వాసాన్ని కాపాడమని తండ్రిని అడగలేదు.

ఆ రాత్రి సాతాను వేసిన జల్లెడలో, పేతురు గర్వాన్ని మరియు స్వయం వెన్నును దేవుడు విరిచాడు. కానీ అతన్ని జారిపోనివ్వలేదు. ఆయన పేతురును తన వైపు తీసుకొని, క్షమించి, పునరుద్ధరించాడు మరియు అతని విశ్వాసాన్ని బలపరిచాడు. ఇప్పుడు మిగిలిన పదిమందిని బలోపేతం చేయడం పేతురు లక్ష్యం. “నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.”

పేతురుకి సహాయం చేయడం ద్వారా యేసు పదిమందికి సహాయం చేసాడు. బలపడినవాడు బలపరిచేవాడు అయ్యాడు.

ఇక్కడ మనకు గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు దేవుడు మీతో నేరుగా వ్యవహరిస్తాడు, అందరూ నిద్రపోతున్న వేళ ఒంటరిగా మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. కానీ చాలాసార్లు (పది సార్లలో తొమ్మిది సార్లు అని చెప్పవచ్చు) దేవుడు మన విశ్వాసాన్ని మరొక వ్యక్తి ద్వారా బలపరుస్తాడు.

మనం విశ్వాసంలో కొనసాగడానికి కావలసిన కృపా వాక్యాన్ని తీసుకురావడానికి పేతురు లాంటి వ్యక్తిని దేవుడు పంపిస్తాడు: “సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.” (కీర్తన 30:5) అనేది ఎలా సాధ్యమో దాని గురించి ఒకరు కొంత సాక్ష్యం ఇవ్వొచ్చు.

నిత్య భద్రత అనేది ఒక సంఘ ప్రణాళిక. సాతాను జల్లెడ పట్టడంలో మీ విశ్వాసం విఫలం కాదనే వాగ్దానంతో దేవుడు మీ హృదయాన్ని ప్రోత్సహించినప్పుడల్లా, ఆ ప్రోత్సాహాన్ని స్వీకరించి, మీరు బలపరచబడిన బలంతో మీ సహోదరీసహోదరులను బలోపేతం చేయడానికి దాన్ని ఉపయోగించడం ద్వారా మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...