దేవుడు దిగాలుగా ఉండడు

దేవుడు దిగాలుగా ఉండడు

షేర్ చెయ్యండి:

అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. (కీర్తనలు 33:10-11)

“మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు” (కీర్తన 115:3). ఈ వచనం యొక్క అంతరార్థం ఏమిటంటే, దేవుడు తనకు సంతోషాన్ని కలిగించే ప్రతిదాన్ని చేసే హక్కు మరియు బలము కలిగి ఉంటాడు. దేవుడు సార్వభౌముడు అని చెప్పడం అంటే ఇదే.

ఒక్కసారి ఆలోచించండి: దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉండి, తనకు నచ్చినది ఏదైనా చేయగలిగితే, ఆయన ఉద్దేశాలు జరగక మానవు. “అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.” (కీర్తనలు 33:10-11).

మరియు ఆయన ఉద్దేశాలు ఏవీ విఫలం కాకపోతే, ఆయన అన్నింటికంటే అందరికంటే సంతోషంగా ఉండి ఉండాలి.

ఈ అనంతమైన, దైవిక ఆనందం అనే జలపాతము నుండి క్రైస్తవుడు దానిని త్రాగుతాడు మరియు మరింత లోతుగా త్రాగాలని కోరుకుంటాడు.

ప్రపంచాన్ని పరిపాలించిన దేవుడు సంతోషంగా లేకుంటే ఎలా ఉంటుందో ఊహించగలరా? ఆకాశంలో జాక్-అండ్-ది-బీన్‌స్టాక్ జెయింట్ లాగా దేవుడు గుసగుసలాడం, విసుగు చెందడం మరియు నిరాశతో ఉంటే ఎలా ఉంటుంది? దేవుడు నిరాశ, నిస్పృహ, దిగులు, విచారం, అసంతృప్తి మరియు నిరుత్సాహానికి గురైనట్లయితే ఎలా ఉంటుంది?

మనం దావీదుతో కలిసి, ఇలా చెప్పగలమా “దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.” (కీర్తనలు 63:1)? నేను అలా అనుకోను.

విసుగు, దిగులు, దుర్భరమైన, అసంతృప్తితో ఉన్న తండ్రిని కలిగి ఉన్న చిన్న పిల్లల వలె దేవుడు ఉన్నాడని మనమందరం అనుకుంటాం. వారు ఆయనని ఆనందించలేరు. వారు ఆయనని ఇబ్బంది పెట్టకూడదని మాత్రమే ప్రయత్నించవచ్చు లేదా ఆయన అనుగ్రహం సంపాదించడానికి బహుశా ఏదైన చేయాలని ప్రయత్నించవచ్చు.

కానీ దేవుడు తీరు అలా కాదు. ఆయన ఎప్పుడూ నిరాశ లేదా నిరుత్సాహాంతో ఉండడు. మరియు, కీర్తన 147:11 చెప్పినట్లు, “తన కృపకొరకు కనిపెట్టువారియందు” ఆయన “ఆనందించువాడైయున్నాడు”. కాబట్టి క్రైస్తవ హెడోనిస్ట్ యొక్క లక్ష్యం ఈ దేవుని నుండి తప్పించుకోవడం కాదు, ఆయన నుండి పారిపోకూడదు లేదా ఆయన దిగులు కోపంగా మారకుండా మెల్లగా గదిలోకి దాక్కోవడం కాదు. లేదు, ఆయన దృఢమైన ప్రేమను ఆశించడం, ఆయన దగ్గరకు పరుగెత్తడమే మన లక్ష్యం. దేవునియందు సంతోషముగా ఉండుటకు, దేవునియందు ఆనందించుటకు, ఆయన సహవాసమును మరియు అనుగ్రహమును భాగ్యముగా భావించి ఆనందించుటే మన లక్ష్యం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...