దేవుడు విగ్రహారాధకుడు కాదు

దేవుడు విగ్రహారాధకుడు కాదు

షేర్ చెయ్యండి:

“ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి”. (2 థెస్సలొనీకయులు 1:10)

క్రీస్తు మహిమపరచబడుటకు మరియు ప్రశంసింపబడుటకు వస్తున్నాడని పౌలు చెప్పాడు. అందుకే ఆయన వస్తున్నాడు.

దేవుడు తన స్వంత మహిమను హెచ్చించుకుంటాడు మరియు తన ప్రజలచే మెప్పు పొందాలని కోరుకుంటాడు అనే బోధనల విషయంలో ప్రజలు కలవరపడతారు, ఎందుకంటే మనము అలా ఉండకూడదని బైబిల్ మనకు బోధిస్తుంది. ఉదాహరణకు, ప్రేమ “స్వప్రయోజనమును విచారించుకొనదు” అని బైబిలు చెబుతోంది (1 కొరింథీయులు 13:5).

దేవుడు ప్రేమగలవాడు అయివుండి “తన స్వంత మహిమ, స్తుతి మరియు ఆనందాన్ని వెదకడానికి” తనను తాను పూర్తిగా ఎలా అంకితం చేసుకుంటాడు? దేవుడు తనకోసమే తాను ఆలోచిస్తే మన పక్షాన ఎలా ఉంటాడు?

నేను ప్రతిపాదిస్తున్న సమాధానం ఇది: దేవుడు సర్వ మహిమాన్వితుడు ఎందుకనగా పూర్తిగా స్వయం సమృద్ధి గల వ్యక్తిగా అద్వితీయుడు. ఆయన మన పక్షాన ఉండాలంటే తనను తాను గొప్ప చేసుకోవాలి. సృజించబడిన వాటికి చెందిన వినయం యొక్క నియమాలు వారి సృష్టికర్తకు అదే విధంగా వర్తించవు.

అనంతమైన ఆనందానికి మూలమైన దేవుడు తనను తాను విడిచిపెట్టినట్లయితే, ఆయన దేవుడిగా ఉండటం మానేస్తాడు. ఆయన తన స్వంత కీర్తి యొక్క అనంతమైన విలువను తిరస్కరించాడు. తనకు వేరుగా విలువైనది ఉందని ఆయన సూచిస్తాడు. ఆయన విగ్రహారాధన చేసేవాడు అవుతాడు.

దీనివల్ల మనకు లాభం ఉండదు. మన దేవుడే అన్యాయస్తుడైతే మనం ఎక్కడికి వెళ్లగలం? దేవుని హృదయం అత్యున్నతమైన విలువైన వాటికి విలువ ఇవ్వడం మానేసినప్పుడు మనం విశ్వంలో బండలాంటి యదార్థతను   ఎక్కడ కనుగొంటాము? అనంతమైన విలువ మరియు అందం యొక్క వాదనలను దేవుడే విడిచిపెట్టినప్పుడు మనము ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తాము?

లేదు, దేవున్ని దేవునిగా ఉండవద్దని అనడం ద్వారా దేవుడు తనను తాను గొప్ప చేసుకోవడాన్ని ప్రేమగా మనం మార్చుకోలేము. దానికి బదులుగా, దేవుడు తన ప్రజల హృదయాలలో తన నామమునకు స్తుతులు రావడం కొరకు నిర్దాక్షిణ్యంగా వెంబడిస్తున్నందున దేవుడు ఖచ్చితంగా ప్రేమ అని మనం తెలుసుకోవాలి. మన ఆనందానికి మరియు ఆయన గొప్పతనానికి మూల స్తంభం, ఆయన గొప్పతనమును బట్టి మనము ఆయనకు అర్పించే ప్రశంసలే.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...