“నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతానునీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి”. (2 సమూయేలు 12:13-14)

ఇది చాలా దారుణం. ఊరియా చనిపోయాడు. బెత్షెబాపై అత్యాచారం జరిగింది. శిశువు చనిపోతాడు. నాతాను “యెహోవా నీ పాపమును పరిహరించెను” అని అంటున్నాడు. 

ఊరికే ఎలా? దావీదు వ్యభిచారం చేశాడు. హత్య చేయమని ఆదేశించాడు. అబద్ధం చెప్పాడు. అతడు “యెహోవా మాటను తృణీకరించాడు” (2 సమూయేలు 12:9). అతడు దేవుణ్ణి దూషించాడు. ప్రభువు చాలా సులువుగా “[అతని] పాపమును పరిహరించెను”?!

దేవుడు ఏ విధంగా న్యాయమైన తీర్పరిగా ఉన్నాడు? మీరు అత్యాచారం, హత్య మరియు అబద్ధమును చూసి చూడనట్లుగా వదిలేయరు. నీతిగల న్యాయమూర్తులు అలా చేయరు.

ఇది పౌలు యొక్క గొప్ప వేదాంత సమస్యలలో ఒకటి – ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న వాటికి చాలా భిన్నమైన సమస్య: దేవుడు పాపాన్ని క్షమించి ఇంకా నీతిమంతుడిగా ఎలా ఉండగలడు? రోమా ​​3:25-26లో పౌలు ఇలా అంటున్నాడు:

పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను

మరో మాటలో చెప్పాలంటే, దేవుడు దావీదు చేసిన పాపాన్ని దాటి వెళ్లిపోతున్నాడు అనిపిస్తే, ఒకవేళ దేవుడు దావీదు పాపాన్ని దుప్పటి కిందకు తుడిచివేస్తుంటే మనకు కలిగే ఆగ్రహం సరియైన ఆగ్రహమే. కానీ దేవుడు అలా చేయలేదు.

దావీదు కాలం నుండి, దావీదు స్థానంలో చనిపోయే తన కుమారుడైన యేసుక్రీస్తు మరణం వరకు అన్నింటినీ దేవుడు చూస్తున్నాడు, తద్వారా దేవుని దయపై మరియు దేవుని భవిష్యత్తు విమోచనపై దావీదు ఉంచిన విశ్వాసం తనను క్రీస్తుతో ఐక్యం చేస్తుంది. మరియు అన్నీ తెలిసిన దేవుడు, దావీదు పాపాలు క్రీస్తు పాపాలుగా పరిగణించాడు మరియు క్రీస్తు నీతి దావీదు నీతిగా పరిగణించాడు. మరియు న్యాయబద్ధంగా దేవుడు క్రీస్తును బట్టి దావీదు పాపాన్ని దాటి వెళ్ళిపోయాడు.

దేవుని కుమారుని మరణం చాలా దారుణమైనది, మరియు దానిని సమర్థించే దేవుని మహిమ చాలా గొప్పది కాబట్టి వ్యభిచారం, హత్య మరియు అబద్ధం విషయంలో దావీదును దాటి వెళ్లిపోవడంలో దేవుడు న్యాయమైనవాడుగా కనిపిస్తున్నాడు. మరియు మన పాపములను కూడా దాటి వెళ్ళిపోయాడు.కాబట్టి దేవుడు తన పరిపూర్ణ నీతిని మరియు న్యాయాన్ని నిలబెట్టుకుంటూనే, అదే సమయంలో ఎంత మంది లేదా ఎంత భయంకరమైన పాపాలు చేసినప్పటికీ యేసుపై విశ్వాసం ఉన్నవారిపై దేవుడు దయ చూపిస్తాడు. ఇది చెప్పనశక్యముకాని శుభవార్త.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *