సంతోషకరమైన దేవుడు

సంతోషకరమైన దేవుడు

షేర్ చెయ్యండి:

శ్రీమంతుడగు [ఆనందించే] దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము, హితబోధకు….. (1 తిమోతి 1:8,10)

దేవుని మహిమలో గొప్ప భాగం ఆయన ఆనందం.

దేవుడు అనంతమైన ఆనందాన్ని నిరాకరించగలగీ మహిమాన్వితమైనవాడుగా ఉండగలడని అపొస్తలుడైన పౌలు ఊహించలేడు. అనంతమైన మహిమాన్వితంగా ఉండటమంటే అనంతమైన ఆనందంగా ఉండటమే. ఆయన “శ్రీమంతుడగు [ఆనందించే] దేవుడు. . . ఆయన మహిమగల సువార్త” అనే మాటలను ఉపయోగించాడు, ఎందుకంటే దేవుడు సంతోషంగా ఉండటం – అనంతమైన ఆనందంగా ఉండటం మహిమాన్వితమైన విషయం.

దేవుని మహిమలో ఆయన మన ఊహకు అందనంత సంతోషంగా ఉన్నాడు.

ఇది సువార్త: ” శ్రీమంతుడగు [ఆనందించే] దేవుడు. . . ఆయన మహిమగల సువార్త.” అది బైబిల్లోని వాక్యం. దేవుడు మహిమాన్వితమైన సంతోషాన్ని పొందడం శుభవార్త.

సంతోషంగా లేని దేవునితో శాశ్వతత్వం గడపాలని ఎవరూ కోరుకోరు. దేవుడు సంతోషంగా లేనట్లయితే, సువార్త యొక్క లక్ష్యం సంతోషకరమైన లక్ష్యం కాదు, మరియు అది సువార్త కాదు.

కానీ, వాస్తవానికి, “నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని ” (మత్తయి 25:23) యేసు చెప్పినప్పుడు సంతోషకరమైన దేవునితో నిత్యత్వం గడపమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆనందం – దేవుని ఆనందం – మనలో ఉండాలని మరియు మన ఆనందం నిండి ఉండాలని యేసు జీవించి మరణించాడు (యోహాను 15:11; 17:13). కాబట్టి, సువార్త “ఆనందించే దేవుని మహిమ సువార్త.”

ప్రప్రధమంగా దేవుని సంతోషం ఆయన కుమారునిలో సంతోషం. ఆ విధంగా మనం దేవుని సంతోషంలో పాలుపంచుకున్నప్పుడు, కుమారునిలో తండ్రి కలిగి ఉన్న ఆనందంలో మనం పాలుపంచుకుంటాము.

అందుకే యేసు తండ్రిని మనకు తెలియజేశాడు. యోహాను 17వ అధ్యాయంలో తన గొప్ప ప్రార్థన ముగింపులో, ఆయన తన తండ్రితో ఇలా అన్నాడు, “నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని” (యోహాను 17:26). తన కుమారునిలోని దేవుని సంతోషం మనలో ఉండేలా మరియు ఆయనలో మనకు సంతోషం కలిగేలా ఆయన దేవుణ్ణి మనకు తెలియజేశాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...