“దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము”. (కీర్తన 51:1)
మూడు సార్లు: ” కరుణింపుము” ” నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున” మరియు ” కృపచొప్పున”.
నిర్గమకాండము 34:6-7లో దేవుడు వాగ్దానం చేసినది ఇదే:
“యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచడు”.
క్షమించబడని దోషులు ఉన్నారని దావీదుకు తెలుసు. అయితే మర్మమైయున్న విమోచన కార్యం ద్వారా దోషులుగా పరిగణించబడకుండా, క్షమించబడేవారు ఉన్నారు. దయతో కూడిన ఆ మర్మమును గ్రహించుటకు 51వ కీర్తనే నిదర్శనం.
“దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము.” ఈ విమోచన మర్మం గురించి దావీదు కంటే మనకు ఎక్కువ తెలుసు. మనకు క్రీస్తు తెలుసు. అయితే దావీదు చేసిన విధంగానే మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించాము. అతను చేసిన నిర్ణయం ఏమిటంటే, నిస్సహాయంగా, దేవుని దయ మరియు ప్రేమ వైపు తిరగడం. ఈ రోజు మనము కూడా నిస్సహాయంగా, క్రీస్తు వైపు తిరగడం ద్వారా ఆయన రక్తం మనకు అవసరమైన దయను పొందేలా చేస్తుంది.