మీకు మేలు చేయడమే దేవునికి ఆనందం 

మీకు మేలు చేయడమే దేవునికి ఆనందం 

షేర్ చెయ్యండి:

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” (లూకా 12:32)

మనం ఎటువంటి పోరాటం లేకుండ నమ్మునట్లు యేసు ఊరకనే పక్కన కూర్చోడు. ఆయన వాక్య ఆయుధాన్ని చేతపట్టి, నమ్మడానికి ఇబ్బంది పడేవారందరి కోసం అధికారంతో మాట్లాడుతాడు.

దేవుడు మనపట్ల దయ చూపేవాడు కాదనే మన భయాన్ని అంటే ఆయన దాతృత్వం కలిగినావాడు కాదని, సహాయకరంగా ఉండడని, దయగలిగినవాడు కాదని, మంచివాడు కాదని, ఆయన మనపట్ల కోపంగా ఉంటాడని, స్నేహపూర్వకంగా ఉండడనే మన నమ్మకాలని తీసివేయడమే ఆయన లక్ష్యం.

కొన్నిసార్లు, దేవుడు మనకు మంచివాడని మనం మేధోపరంగా నమ్మినప్పటికీ, ఆయన మంచితనం బలవంతంగా మన మనసుల్లో చొప్పించబడిందని మనం భావించవచ్చు. బహుశా ఇది ఒక న్యాయమూర్తి తాను జైలుకు పంపడానికి ఇష్టపడే ఖైదీపై అభియోగాలను కొట్టివేయమని ఒక తెలివైన న్యాయవాది ఒత్తిడి చేసినట్లుగా ఉండవచ్చు.

అయితే, దేవుని గురి౦చి అలా మనం భావి౦చకు౦డ ఉండాలని ఆయన ఎంతో కృషి చేస్తాడు. లూకా 12:32వ వచనంలో దేవుని రాజ్యాన్ని మనకివ్వడంలో ఆయనకున్న సంపూర్ణ ఆనందాన్ని వివరించడం ద్వారా దేవుని ఆత్మ యొక్క సాటిలేని విలువను మరియు శ్రేష్టతను వర్ణించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు.

దేవుడు అయిష్టంగానే ఆశీర్వాదాలను ఇస్తాడని; ఆయన మంచి పనులు చేసేటప్పుడు తన స్వభావానికి విరుద్ధంగా చేస్తాడని; ఆయన ఎల్లప్పుడూ కోపగించుకుంటాడని అలా చేయడానికి ఇష్టపడతాడని మనం ఎదుర్కునే ప్రతి సంఘర్షణ యేసుకు తెలుసు. ఆ భయాన్ని తీసివేసేందుకు సహాయం చేయడానికే “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది” అని చెప్పాడు. ఇందులో ప్రతి మాట ఉద్దేశపూర్వకంగానే చెప్పబడింది.

లూకా 12:32 – “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” ఇది దేవుని స్వభావాన్ని దేవుని హృదయాన్ని వివరించే వాక్యం. ఈ వచనం దేవుణ్ణి ఏది సంతోషపరుస్తుందనే దాని గురించి చెప్పబడిన వాక్యం, అంటే ఈ వచనం కేవలం దేవుడు చేయాల్సిన పని లేక చేసే పని గురించి కాదు గాని ఆయన ప్రేమతో ఇష్టపడి చేసే పని గురించి,  సంతోషించే పని గురించి ఈ వచనం మాట్లాడుతోంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...