దేవుని వద్దకు నేరుగా వెళ్ళండి
“ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు”. (యోహాను 16:26-27)
దేవుని కుమారుడైన యేసు కీస్తును మధ్యవర్తిగా మాత్రమే పరిగణించవద్దు. “మీ పక్షాన నేను తండ్రిని వేడుకుంటానని నేను మీతో చెప్పట్లేదు” అని యేసు చెప్తున్నాడు. వేరొక విధంగా చెప్పాలంటే, మీరు తండ్రి వద్దకు నేరుగా వెళ్ళలేరన్నట్లుగా, తండ్రికి మరియు మీకు మధ్యన నేను అడ్డు రాను. ఎందుకు అడ్డురానంటే, “తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.” అని యేసు చెబుతున్నాడు.
ఇది ఆశ్చర్యకరమైన విషయం. తన సన్నిధిలోనికి మనం నేరుగా వెళ్ళడం, సర్వశక్తిమంతుడైన తండ్రికి ఇష్టం లేదన్నట్లుగా, మనం తండ్రి గురించి ఆలోచించకూడదని యేసు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసు మీరు “నేరుగా” అని చెప్పినప్పుడు, “మీ పక్షాన మీ ప్రార్థనా మనవులన్నీ నేను దేవుని వద్దకు తీసుకు వెళ్లను, మీరు నేరుగా వాటిని తండ్రితో చెప్పవచ్చు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన వద్దకు మీరు వెళ్లాలని ఆయన కోరుతున్నాడు, ఆయన మీపట్ల కోపంగా లేడు” అని నేను అర్థం చేసుకున్నాను.
పాపముతో నిండి ఉన్న ఏ మనిషి కూడా, యేసు క్రీస్తు రక్తం ద్వారా తప్ప మరి దేని ద్వారా దేవుని వద్దకు వెళ్ళలేడన్నది నగ్న సత్యం (హెబ్రీ 10:19-20). ఇప్పుడు ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు (రోమా 8:34; హెబ్రీ 7:25). ఇప్పుడు ఆయన తండ్రి దగ్గర మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు (1 యోహాను 2:1). ఇప్పుడు ఆయన దేవుని సింహాసనం ఎదుట మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు (హెబ్రీ 4:15-16). “…నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు” అని ఆయన చెప్పాడు (యోహాను 14:6).
అవును. యేసు ద్వారానే తండ్రి వద్దకు వెళ్ళగలం. అయితే, మధ్యవర్తిగా తాను చేసే విజ్ఞాపన పరిచర్యను మనం ఎక్కువగా తీసుకోకుండా, ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. “మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు” అంటాడు. యేసు మన కోసం అక్కడ ఉన్నాడు. తండ్రి యొక్క ఉగ్రతను మన నుండి తీసివేయడానికి, శాశ్వత కాలం ఉండే, శాశ్వతమైన సజీవ సాక్ష్యాన్ని యేసు మనకు అందిస్తున్నాడు.
మన తరపున మాట్లాడటానికి లేదా తండ్రి నుండి మనల్ని దూరంగా పెట్టడానికి ఆయన అక్కడ లేడు. తండ్రి మనకు దూరముగా లేదా స్నేహపూర్వకంగా లేడని ఆయన మనకు సూచించడం లేదు. బదులుగా,”తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు” అనే మాటలను గుర్తుంచుకోండి అంటున్నాడు.
కాబట్టి, రండి. ధైర్యంగా రండి (హెబ్రీ 4:16). నిరీక్షణగలవారై రండి. చిరునవ్వును ఆశిస్తూ రండి. ఆనందంతో వణకుతూ రండి గాని భయంతో కాదు. “దేవుని వద్దకు వెళ్ళడానికి మార్గం సరాళం చేశాను. ఇప్పుడు ఆ మార్గంలో నేను జోక్యం చేసుకోను లేదా ఎటువంటి సమస్యలను కలిగించను” అని యేసు చెప్తున్నాడు. అందుచేత రండి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web