మీరు పగతీర్చుకొనక దేవునికి వదిలిపెట్టండి

మీరు పగతీర్చుకొనక దేవునికి వదిలిపెట్టండి

షేర్ చెయ్యండి:

“ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి – పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది”. (రోమా 12:19)

మనకున్న పగను, ప్రతీకార ఆలోచనను జయించడంలో ఇది ఎందుకంత కీలకమైన వాగ్దానం.  ఎందుకంటే, కోపం వెనుక ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రేరణలలో ఒక ప్రేరణకు ఈ వాగ్దానం జవాబునిస్తుంది, అది పూర్తిగా ఎటువంటి లోపంలేని ఒక ప్రేరణగా ఉంటుంది.

అనేక విషయాలలో మనకు నిజంగానే అన్యాయం జరిగింది. కాబట్టి న్యాయం జరగాలని అనుకోవడం పూర్తిగా తప్పు కాదు. ఇక్కడ తప్పంతా అది జరగాలి  ఇది జరగాలని భావించడం, అది జరిగే వరకు మనం పగతో రగిలిపోవడం. ఇది ఘోరమైన తప్పవుతుంది.

నా సెమినరీ రోజుల్లో, నోయల్ మరియు నేను దంపతులకు సంబంధించిన వ్యక్తిగత లోతైన విషయాలను చర్చించుట కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న గుంపులో భాగస్తులుగా ఉన్నాం. ఒక రోజు సాయంత్రం మేము క్షమాపణ, కోపం అనే అంశాల గురించి చర్చించుకున్నాము. చిన్నప్పుడు తన తల్లి చేసిన తప్పునుబట్టి తల్లిని క్షమించలేనని, క్షమించలేక ఉన్నానని ఒక యౌవనస్తురాలు తెలిపింది.

క్షమించని ఆత్మకు సంబంధించి కొన్ని వాక్యానుసారమైన ఆజ్ఞలు, హెచ్చరికల గురించి మేము మాట్లాడుకున్నాం. 

  • ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెసీ 4:32)
  • మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. (మత్తయి 6:15)

అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. అందుకు క్షమించరాని చేదు ధోరణిని కొనసాగిస్తే ఆమె ఆత్మకే ప్రమాదం అని హెచ్చరించాను. కానీ తన తల్లిని క్షమించనని మొండికేసింది.

అలాంటి పగ, ప్రతీకారముతో నిండిన ఆత్మను జయించేందుకు మనకు సహాయం చేసే సాధనంగా రోమా 12వ అధ్యాయంలో దేవుని తీర్పుకు సంబంధించిన కృపను గురించి మనకు వాగ్దానం చేయబడింది.

తప్పులన్నీ దేవుని ద్వారానే పరిష్కరించబడతాయనే నిశ్చయతతో మనం ఉండవచ్చని, ప్రతీకారం ప్రభువుకు చెందినది కాబట్టి ఈ విషయాన్ని ఆయన చేతుల్లో పెట్టవచ్చని పౌలు వాదన. మన ప్రతీకార వాంఛలను తీర్చుకునేలా మనల్ని ప్రేరేపించడానికి ఆయన మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, అదేంటంటే  “నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు.”

క్షమించకపోవడం, పగ, ప్రతీకారాల ఆత్మ నుండి మనల్ని విడుదల చేస్తాడనే వాగ్దానమే దేవుడు మన లెక్కల్ని కూడా చూసేందుకు ఇవ్వబడిన వాగ్దానం. ఆయన మనకన్నా న్యాయబద్ధంగా, కరుణతో, మరింత ఎక్కువ సమగ్రంగా ఆ పనిని చేస్తాడు. సకల పాపాలను శిక్షిస్తాడు. ఎవరూ తప్పించుకోలేరు. పశ్చాత్తాపపడి ఆయనను విశ్వసించిన వారి కోసం దానిని సిలువపైన క్రీస్తులోనైనా, ఆయనను విశ్వసించని వారి కోసం నరకంలోనైనా శిక్షిస్తాడు. కాబట్టి, మన౦ వెనక్కి తగ్గి, దేవుడు తన పరిపూర్ణమైన పనిని చేయడానికి అవకాశమివ్వాలి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...