శాశ్వత తృప్తిని పొందుకున్నాం

షేర్ చెయ్యండి:

“అందుకు యేసు వారితో ఇట్లనెను – జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.” (యోహాను 6:35)

యేసును విశ్వసించడమంటే యేసును తినడం, త్రాగడమని ఈ వాక్యభాగం సూచిస్తోంది. యేసే మన ఆత్మ దాహం తీరుస్తుందని, ఇక ఎన్నడూ దప్పికవ్వదని మనకు ఈ వాక్యం తెలియజేస్తుంది.

తృప్తి కోసం మనకున్న దాహాన్ని ఆయనే తీరుస్తాడు.. ఇంతకు మించి అతీతమైన, ఉత్తమమైన విషయం మరేది లేదు.

యోహాను చెప్పిన విధానంలో మనం యేసును నమ్మినప్పుడు యేసు యొక్క వాగ్దానం మరియు ఆయన సన్నిధి వలన పాపపు శోధనలు మనపై ప్రభుత్వం చేయవు అనేది మనకు ఎంతో తృప్తిని కలుగజేస్తాయి (రోమా 6:14 వచనాన్ని చూడండి). యేసునందుంచే అటువంటి విశ్వాసం పాపపు శక్తిని (లేక అధికారాన్ని) నాశనం చేసి, విధేయతను పుట్టిస్తాయని ఈ వాక్యభాగాలు చెప్తున్నాయి.

యోహాను 4:14 వచనం అదే విషయాన్ని చెప్తోంది: “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.” యోహాను 6:35వ వచనం ప్రకారంగా, ఇక్కడ చెప్పబడిన రక్షించే విశ్వాసం అనేది అంతరంగం యొక్క లోతైన ఆకాంక్షలను తృప్తిపరిచే త్రాగే నీళ్లుగా చెప్పబడింది. సంతృప్తి అనేది ఊరేడి బుగ్గగా మారుతుంది.

ఇదే విషయాన్ని యోహాను 7:37-38 వచనాలలో కూడా చెప్పబడుతోంది: “ఆ పండుగలో మహా దినమైన అంత్య దినమున యేసు నిలిచి – ఎవడైనను దప్పిగొనినయెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.” “అతని కడుపులోనుండి (హృదయములోనుండి) జీవజల నదులు పారును.”

విశ్వాసం ద్వారా మనల్ని పరలోకానికి నడిపించే, చిరకాలం శాశ్వతంగా నిలిచిపోయే సంతృప్తికరమైన జీవితపు తరగని ఊరెడి బుగ్గగా క్రీస్తు మనలోనికి వచ్చాడు మరియు తృప్తి కలిగించే ఇతర పాపభూయిష్టమైన ఆకర్షణలనుండి మనకు విడుదలను కలిగిస్తాడు. ఆయన ఆత్మను మన కోసం పంపించడం ద్వారా ఆయన ఈ పనిని జరిగిస్తాడు (యోహాను 7:38-39).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...