ప్రార్థనలో మొదటి ప్రాధాన్యత

ప్రార్థనలో మొదటి ప్రాధాన్యత

షేర్ చెయ్యండి:

“మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక”. (మత్తయి 6:9)

ప్రభువు నేర్పిన ప్రార్థనలో, మన పరలోకపు తండ్రి నామమును పరిశుద్ధపరచమని అడగడమే ప్రార్ధనలో మొదటి ప్రాధాన్యత అని యేసు బోధించాడు. మనలో, సంఘంలో, ఈ లోకంలో, ప్రతిచోటా.

ఇది ఒక విన్నపము, అభ్యర్థన అని గమనించండి. ఇది ప్రకటన లేదా ప్రశంస కాదు. ఇది ప్రశంసలను వ్యక్తపరచడం కాదు, కానీ విన్నపము. కొన్నేళ్లుగా నేను ప్రభువు ప్రార్థనను స్తుతితో ప్రారంభించినట్లు తప్పుగా చదివాను: “దేవుని స్తుతించండి, ప్రభువు పేరు పవిత్రమైనది, గౌరవించబడింది, ఘనపరచబడింది!” కానీ అవి ప్రశంసలు కాదు. ఇది ప్రార్థన. దేవుని నామము పవిత్రమయ్యేలా చూడవలసిందిగా దేవున్ని అడగటం.

మత్తయి 9:38 కూడా ఇలాంటి వచనమే. ఇక్కడ యేసు తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. కూలీలుగా ఉన్న మనమే మనకంటే పంట గురించి బాగా తెలిసిన పొలం యజమానిని కోతకు ఇంకొంతమంది పనివారిని పంపుమని అడగమని ఆదేశించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

అయితే ప్రభువు ప్రార్థనలో ఉన్నది ఇదే కదా? – తన నామము యొక్క ఘనత కోసం తన పేరు పవిత్రంగా ఉండేలా అంటే ఘనపరచబడేలా, గౌరవించబడేలా, అత్యంత విలువైనదిగా గొప్పచెయ్యబడేలా చూడమని అపరిమితమైన రోషముగల దేవుణ్ణి అడగమని యేసు చెబుతున్నాడు.

ఇది మనల్ని ఆశ్చర్యపరచవచ్చు, కానీ అది నిజమే. మరియు ఇది మనకు రెండు విషయాలను బోధిస్తుంది.

1. ఒకటి, ప్రార్థన దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికి ప్రేరేపించదు. తన నామము పరిశుద్ధపరచబడాలనే  ఉద్దేశ్యంతో దేవుడు ఉన్నాడు. దేవుని ప్రాధాన్యతలలో దీనికంటే ఏదీ ఉన్నతమైనది కాదు. అయినా మనం కూడా అడగాలి.

2. మరొకటి ఏమిటంటే, మన ప్రాధాన్యతలను ఆయన ప్రాధాన్యతల మార్గంలోనికి తీసుకురావడానికి ఈ ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ఆయన గొప్ప సంకల్పాలకు అనుగుణంగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప విషయాలను మన ప్రార్థనల ద్వారా చేయాలని కోరుకుంటాడు.దేవుని నామము పరిశుద్ధపరచబడటానికి మీ హృదయాన్ని దేవుని రోషమునకు అనుగుణంగా ఉండేలా చేయండి.  మరియు అప్పుడు మీరు గొప్ప ప్రభావంతో ప్రార్థిస్తారు. మీ మొదటి మరియు మీ జీవితంలో అన్నింటినీ నిర్ణయించే ప్రార్థనగా దేవుని నామము పరిశుద్ధపరచబడటమును ఉండనివ్వండి. అప్పుడు ఆయన నామం పట్ల రోషముగా ఉండే దేవుని శక్తిని మీ ప్రార్థనలు పొందుతాయి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...