పోరాటం చేసే మాటలు

షేర్ చెయ్యండి:

“నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును”. (యెషయా 41:10)

ఏదైనా ప్రమాదంతో కూడిన క్రొత్త పని లేక ఒక సమావేశ౦ గురి౦చి నేను చింతిస్తున్నప్పుడు, నేను తరచూ ఉపయోగి౦చే వాగ్దానాల్లో ఒకటైన యెషయా 41:10వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్దంగా పోరాడుతాను. 

నేను జర్మనీలో మూడేళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన రోజు, మా నాన్న చాలా దూరంలో ఉన్న న్యూయార్క్ నుండి పోన్ చేసి, ఫోన్ లోనే ఈ వాగ్దానం నాకు ఇచ్చారు. విపరీతమైన ఒత్తిడిలో ఉన్న నన్ను బయటకు తీసుకు రావడానికి మూడేళ్లుగా నేను వందలసార్లు ఈ వాగ్దానాన్ని అన్వయించుకున్నాను. 

నా మనస్సు అనే మోటర్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు, గేర్ల శబ్దంగా యెషయా 41:10 నాకు వినిపిస్తూ ఉండేది. నాకు ఈ వచనమంటే చాలా ఇష్టం. 

వాస్తవానికి, నా విశ్వాసం యొక్క ఆయుధాగారంలో బాకు అనే ఈ ఆయుధం మాత్రమే కాకుండా నా దగ్గర ఇంకా ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. 

నా పరిచర్య నిరుపయోగంగాను, శూన్యంగాను ఉందని నేను చింతిస్తున్నప్పుడు, “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును” అనేటువంటి యెషయా 55:11వ వచనములోని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకంతో పోరాడుతాను.

నా పనిని చేసుకోవడంలో నేను చాలా బలహీనంగా ఉన్నాననే విషయం గురించి నేను చింతిస్తున్నప్పుడు, “నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నది” (2 కొరింథీ 12:9) అని క్రీస్తు ఇచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్దంగా పోరాడుతాను. 

భవిషత్తు గురించి తీసుకోవలసిన నిర్ణయాలు గురించి నేను చింతిస్తున్నప్పుడు, “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తన 32:8) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్దంగా పోరాడుతాను. 

శత్రువులను ఎదుర్కోవడం గురించి నేను చింతిస్తున్నప్పుడు, “ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?” (రోమా 8:31) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్దంగా పోరాడుతాను. 

నేను ప్రేమిస్తున్నవారి క్షేమం గురించి నేను చింతిస్తున్నప్పుడు, నేను చెడ్డవాడనై ఉండి నా పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును” (మత్తయి 7:11) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్దంగా పోరాడుతాను. 

కాబట్టి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని అన్ని విధాలుగా అపనమ్మకంతో పోరాటం చేయండి. అయితే, ఇది ఒక కేంద్రీకృతమైన, ప్రాథమిక ఆయుధమును కలిగి ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది. నా విషయంలోనైతే అది, “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” (యెషయా 41:10). ఇది శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన వాగ్దానం!

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...