ఆనందం కోసం పదిహేను వ్యూహాలు
“జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు”. (కీర్తన 16:11)
పాప దుఃఖములతో కూడిన ఈ జీవితంలో, విశ్వాసంలాగే ఆనందం కూడా యుద్ధంలో చిక్కుకుంది. పౌలు తిమోతితో ఇలా అన్నాడు, “విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము” (1 తిమోతి 6:12). కాబట్టి ఆనందం కొరకు పని చేయాలి మరియు పోరాడాలి. పౌలు కొరింథీయులతో ఇలా అన్నాడు, “మీ ఆనందమునకు సహకారులమై యున్నాము” (2 కొరింథీయులు 1:24).
మనం ఆనందం కోసం ఎలా పోరాడాలి? మీకోసం 15 వ్యూహలు (ఇవన్నీ బైబిల్ ఆధారంగా వ్రాయబడ్డ సత్యాలే).
1. దేవునిలో నిజమైన ఆనందం ఒక బహుమానమని గ్రహించండి.
2. ఆనందం కోసం తీవ్రంగా పోరాడాలని గ్రహించండి. మరియు ఈ మొదటి రెండు అంశాలు ఒకదానికొకటి విరుద్ధంగా అనిపించినా ప్రక్కన పెట్టొద్దు.
3. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ జీవితంలో మీరు గుర్తించిన పాపాలన్నింటిపై దాడి చేయడానికి దృఢమైన నిర్ణయం తీసుకోండి.
4. అపరాధ భావమును దైర్యంగా ఎదుర్కునే రహస్యాన్ని నేర్చుకోండి; అనగా నీతిమంతుడుగా తీర్చబడిన పాపిలా ఎలా పోరాడాలి అనే సత్యాన్ని తెలుసుకోండి.
5. ఈ పోరాటం ప్రాథమికంగా దేవుడు ఎవరో అని గ్రహించడానికి జరిగే పోరాటమని గ్రహించండి.
6. పగలు మరియు రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించండి.
7. మీ మనోనేత్రాలు తెరువబడాలని మరియు దేవుని పట్ల అపేక్ష కలిగి ఉండాలని హృదయపూర్వకంగా మరియు నిరంతరం ప్రార్థించండి.
8. మీ మాటల్ని మీరు వినడానికి బదులు మీకు మీరే బోధించడం నేర్చుకోండి.
9. మీ పోరాటంలో పోరాడటానికి మీకు సహాయం చేసే ‘దేవుని జ్ఞానంతో నింపబడిన’ వ్యక్తులతో సమయాన్ని గడపండి.
10. దేవుడు కనిపించనట్లుగా అనిపించే చీకటి సమయాలలో ఓపికగా ఉండండి.
11. మీ శరీరానికి అవసరమైన దేవుడు రూపొందించిన విశ్రాంతిని, వ్యాయామాన్ని మరియు సరైన ఆహారాన్ని ఇవ్వండి.
12. ప్రకృతిలో దేవుని ప్రత్యక్షతను సరిగ్గా ఉపయోగించుకోండి – చక్కగా ప్రకృతిని ఆనందిస్తూ నడవండి.
13. దేవుని గురించిన గొప్ప పుస్తకాలను మరియు గొప్ప పరిశుద్ధుల జీవిత చరిత్రలను చదవండి.
14. ఇతరుల కొరకు కష్టమైన మరియు ప్రేమపూర్వకమైన పనులు చేయండి (మీ నోటితో చెప్పే సాక్ష్యం మరియు దయతో కూడిన పనులు).
15. క్రీస్తును పరిచయం చేయడం కొరకు సర్వలోక దర్శనం కలిగి ఉండండి. మరియు సువార్త చేరుకోని వారి కోసం మీ జీవితాలను సమర్పించండి.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web