“నేను దేవుని కృపను నిరర్థకము చేయను”; (గలతీ 2:21)

నా బాల్యములో నేను ఒకసారి సముద్ర తీరములో నీళ్ల దగ్గర నిలబడ్డప్పుడు, క్షణాల్లో సముద్రం మధ్యలోకి నన్ను లాగబోతున్నట్లు అనిపించింది.

నేను చాలా భయపడ్డాను. నేను స్థిరంగా నిలబడి ఏ మార్గం ద్వారా ఒడ్డుకు చేరుకోవచ్చో గుర్తించడానికి ప్రయత్నించాను. కానీ నేను నేలపై నా పాదాలను పెట్టలేకపోయాను మరియు ఈత కొట్టడానికి ప్రవాహం చాలా బలంగా ఉంది. నేను గొప్ప ఈతగాడ్ని కూడా కాదు.

ఆ భయాందోళనలో నేను ఒకే ఒక్క విషయం గురించి ఆలోచించాను: ఎవరైనా నాకు సహాయం చేయగలరా? కానీ నేను నీటి లోపల నుండి పిలవలేకపోయాను.

నా తండ్రి చేయి నా చేయిని బలంగా పట్టుకున్నట్లు అనిపించినప్పుడు, అది ప్రపంచంలోనే మధురమైన అనుభూతి. నేను అతని బలానికి పూర్తిగా లొంగిపోయాను. నేను అతనికి నచ్చినట్లు పైకి తీస్తున్నప్పుడు ఆనందించాను. నేను ప్రతిఘటించలేదు.

పరిస్థితులు అంత ఘోరంగా లేవు అని చూపించేలా ప్రయత్నించాలనే గాని లేదా మా నాన్న చేతికి నా బలాన్ని జోడించాలి అనే ఆలోచన గాని నా మనస్సులోకి రాలేదు; నేను అనుకున్నదల్లా, అవును! నాకు నువ్వు కావాలి! నీకు నా ధన్యవాదములు! నీ బలం నాకు ఇష్టం! నీ చొరవ నాకు ఇష్టం! నువ్వు చాలా గొప్పవాడివి!

నన్ను నేను సంపూర్ణంగా ఆయనకు లొంగిపోవడానికి ఇష్టపడినప్పుడు, నేను అతిశయించాల్సింది నాలో ఏమీ లేదు. ఇష్టంగా సమర్పించుకోవడమే “విశ్వాసం” అని పిలుస్తాను. మరియు నా తండ్రి నాకు చాలా అవసరమైన  మరియు సముద్రములో నేను అపేక్షించిన భవిష్యత్ దేవుని దయ యొక్క స్వరూపము. ఇది కృపను గొప్పచేసే  విశ్వాసం.

క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఉన్నతమైన ఆలోచన ఏంటంటే: దేవుని కృపను నిరర్థకము చేయకుండా నేను ఎలా గొప్ప చేయగలను? గలతీ 2:20-21లో పౌలు ఈ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు, “నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను;”

అతని జీవితం ద్వారా దేవుని కృపను ఎందుకు నిరర్థకము చేయలేదు? ఎందుకంటే అతను దేవుని కుమారునిపై విశ్వాసంతో జీవిస్తున్నాడు. విశ్వాసం అందరి దృష్టిని కృప వైపుకు తిప్పుతూ దానిని నిరర్థకము చేయకుండా పెద్దది చేస్తుంది.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *