“అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమ పరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను”. (రోమా 4:20-21)
దేవుని భవిష్యత్ కృపను విశ్వాసమనేది ఎందుకు మహిమపరుస్తుందో ఒక ప్రత్యేక కారణం పౌలు మనస్సులో ఉంది. మరో మాటలో సులభంగా చెప్పాలంటే, భవిష్యత్తుకు సంబంధించి దేవుని యథార్థతపై, ఆయన శక్తిపై మరియు వాగ్దానాలన్నింటినీ నెరవేర్చే ఆయన జ్ఞానంపై ఉండే నమ్మకమే దేవుణ్ణి మహిమపరిచే విశ్వాసం.
పౌలు ఈ విశ్వాసమును మనకి వివరించడానికి అబ్రహము దేవుని వాగ్దానానికి ఎలా ప్రతిస్పందించాడో చెప్తున్నాడు: అతను వృద్ధుడైనప్పటికీ మరియు అతని భార్య గొడ్రాలు అయినప్పటికీ అతను అనేక దేశాలకు తండ్రి అవుతాడు (రోమా 4:18). “నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను” అంటే, నమ్మకానికి విరుద్ధంగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ దేవుని వాగ్దానం యొక్క భవిష్యత్ కృపపై అతను విశ్వాసం కలిగి ఉన్నాడు.
“మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను”. (రోమా 4:19–21)
అబ్రాహాము అతన్ని అనేక దేశాలకు తండ్రిని చేస్తానని దేవుడు చేసిన వాగ్దానంపై విశ్వాసం ఉంచాడు. ఈ విశ్వాసం దేవుణ్ణి మహిమపరిచింది; ఎందుకంటే వాగ్దానాలను నెరవేర్చడానికి అవసరమైన దేవుని సర్వశక్తిమంతమైన, మానవాతీతమైన వనరులపైన అబ్రహము యొక్క విశ్వాసం దృష్టి పెట్టింది.
అబ్రాహాము ముసలివాడు కాబట్టి పిల్లలు పుట్టరు, శారా గొడ్రాలు. అంతే కాదు: దేవుడు చెప్పిన “అనేక దేశాల”కు అబ్రాహాము తండ్రి అవుతాడని అన్నప్పుడు, ఒక కొడుకు లేదా ఇద్దరి ద్వారా అది ఎలా సాధ్యం? ఇది పూర్తిగా అసాధ్యం అనిపించింది.కాబట్టి, అబ్రాహాము విశ్వాసం దేవుని మహిమపరిచేదిగా ఉంది. దేవుడు మానవులకి అసాధ్యమైన వాటిని చేయగలడని మరియు చేస్తాడని అబ్రాహాము పూర్తిగా నిశ్చయత కలిగి ఉన్నాడు. మనం కలిగి ఉండవలసిన విశ్వాసం ఏంటంటే మనం ఎన్నటికీ చేయలేనిది దేవుడు మనకోసం చేస్తాడు.
దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలుగును గాక మీ వార్తమానలు మమ్మును చాల. బలపరుచుచున్నావి