అపరాధాన్ని, దురాశను, భయాన్ని విశ్వాసం వెళ్ళగొడుతుంది

షేర్ చెయ్యండి:

“ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే”. (1 తిమోతి 1:5)  

ఇక్కడ పౌలు ప్రేమను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ గొప్ప ప్రభావానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన ఆధారలన్నిటిలో ఒకానొక ప్రాముఖ్యమైన ఆధారం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసమే. విశ్వాసం అనేది ప్రేమకు ఖచ్చితమైన ఆధారం కావడానికి కారణం ఏంటంటే దేవుని కృపలో విశ్వాసం ఉంచుట ద్వారా ప్రేమకు ఆటంకం కలిగించే పాప శక్తులన్నిటిని హృదయం నుండి వెళ్ళగొడుతుంది.

మనం అపరాధ భావాన్ని కలిగియున్నామని భావించినప్పుడు, మనం స్వీయ-కేంద్రిత నిరాశలో, స్వీయ జాలిని కలిగియుండడంలో ఉండిపోవడానికి గురవుతుంటాం, మరొకరి అవసరాన్ని చూడలేం, మరొకరిని పట్టించుకోలేం. లేదా, మన అపరాధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేషధారణను ప్రదర్శిస్తుంటాం, తద్వారా సంబంధాలలో ఉన్నటువంటి నిజాయితీనంతటిని నాశనం చేస్తాం, ఇది నిజమైన ప్రేమను చూపించడం అసాధ్యమన్నట్లుగా చేస్తుంది. లేదా, మన స్వంత అపరాధాన్ని తగ్గించుకోవడానికి ఇతరుల తప్పుల గురించి మాట్లాడతాము, ప్రేమ ఇతరుల తప్పుల గురించి మాట్లాడదు. అందుచేత, మనం ప్రేమించాలనుకుంటే, అపరాధం యొక్క వినాశకరమైన ప్రభావాలను తప్పనిసరిగా అధిగమించాలి.

ఇది భయం అనే విషయంలోనూ అంతే. మనకు భయమనిపించినప్పుడు, సంఘంలో ఆహ్వానం మరియు ప్రోత్సాహాలు అవసరమైన ఒక తెలియని వ్యక్తి దగ్గరకి వెళ్ళాలనుకోము. లేదా సరిహద్దులో చేసే మిషన్(సువార్తీకరణ)ను  ఒక వృత్తిగా తిరస్కరించవచ్చు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. లేదా మితిమీరిన జీవిత భీమా (ఇన్సూరెన్స్) కోసం మనం డబ్బును వృథా చేయవచ్చు లేదా ఇతరుల అవసరాల విషయంలో మనల్ని మనం భ్రమలకు గురి చేసి, గుడ్డితనం కలుగజేసే అనేకమైన చిన్న చిన్న భయాలలో ముంచేసుకోవచ్చు. ఇవన్నీ ప్రేమకు వ్యతిరేకమైనవే.

ఇది లోభం (దురాశ) విషయంలోనూ అంతే. మనం లోభులమైతే (దురాశపరులమైతే) మనం డబ్భును విలాసవంతంగా ఖర్చు చేయవచ్చు, అంటే సువార్త వ్యాపకానికి వెళ్లవలసిన డబ్బు మన విలాసవంతమైన సుఖాలకు వాడవచ్చు. మన అమూల్యమైన ఆస్తులు, ఆర్ధికపరంగా మన భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా మనం సాహసోపేతమైన (రిస్క్ తో కూడిన) పనులు చేపట్టం. మనం ప్రజలపైన దృష్టి పెట్టడానికి బదులుగా విషయాలపై దృష్టి పెడతాం, లేక లోకపరమైన ప్రయోజనాల కోసం వనరులుగా ప్రజల్ని చూస్తాం. తద్వారా, ప్రేమ నాశనమైపోతుంది.

అయితే, భవిష్యత్తు కృపలో విశ్వాసముంచుట ద్వారా మన హృదయములో ఉండే అపరాధ భావాన్ని, లోభాన్ని (దురాశను) మరియు భయాన్ని వెళ్ళగొడుతుంది.

ఇది అపరాధ భావాన్ని వెళ్ళగొడుతుంది, ఎందుకంటే ఇప్పటికీ, ఎల్లప్పటికీ నీతిమంతులుగాను మరియు నిర్దోషులుగాను భద్రతను కలుగజేసేందుకు క్రీస్తు మరణం సరిపోయినదనే నిరీక్షణను ఇది గట్టిగా పట్టుకుంటుంది (హెబ్రీ 10:14).

ఇది భయాన్ని వెళ్ళగొడుతుంది, ఎందుకంటే “నీకు తోడైయున్నాను, భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను, దిగులుపడకుము నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” (యెషయా 41:10) అనేటువంటి వాగ్ధానం మీద ఇది ఆధారపడుతుంది.

మరియు ఇది లోభాన్ని (దురాశను) వెళ్ళగొడుతుంది, ఎందుకంటే లోకమంతా ఇచ్చేదానికంటే క్రీస్తే గొప్ప సంపదనే నిశ్చయతను కలిగి ఉంటుంది (మత్తయి 13:44).

అందుచేత, “ఉపదేశసారమేదనగా…. నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే” అని పౌలు చెప్పినప్పుడు, ప్రేమించడానికి ఆటంకంగా ఉండే ప్రతి దానిని జయించడానికి విశ్వాసపు అద్భుతమైన శక్తి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాస పోరాటమును మనం పోరాడినప్పుడు, అంటే అపరాధ భావాన్ని, భయాన్ని, లోభాన్ని చంపేటువంటి దేవుని వాగ్దానాలను నమ్మడానికి పోరాడినప్పుడు, మనం ప్రేమ కోసం పోరాడుతున్నాం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...