“ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము”. (1 యోహాను 3:16)

క్రీస్తు మరణిoచినపుడు ఆయన ఎలాగయితే ఉద్దేశపూర్వకంగా శ్రమను అనుభవించాడో, అలాగే మనపట్ల మనస్ఫూర్తిగా ప్రేమ కలిగియున్నాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన ప్రాణాలను త్యజించినట్లయితే, అది మన కోసమే. అదే ప్రేమ.

“తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.” (యోహాను 13:1)

“నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడమే కల్వరి మార్గంలోని ప్రతి అడుగు యొక్క అర్థం.

అందువల్ల, క్రీస్తు తన ప్రాణము పెట్టడంలో ఉన్న ప్రేమను మనం అనుభవించాలంటే, ఎంత ఉద్దేశపూర్వకంగా క్రీస్తు ఈ పనిని చేస్తున్నాడో అర్ధమవాలి.

పేతురు సైనికుని పుర్రెను చీల్చడానికి ప్రయత్నించినప్పుడు, అతని చెవిని మాత్రమే కత్తిరించిన ఆ హింసాత్మక క్షణం తర్వాత యేసు ఏమి చెప్పాడో చూడండి.

“యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.” (మత్తయి 26:52–54)

పాత నిబంధనలో యేసు మరణం గురించిన వివరాలు ముందుగానే చెప్పబడ్డాయి అని చెప్పడం ఒక విషయం. అయితే లేఖనాలు నెరవేరేలా చూసేందుకు యేసు స్వయంగా తనకు తానుగా నిర్ణయాలు చేసుకున్నాడని చెప్పడం ఇంకా గొప్ప విషయం.

మత్తయి 26:54లో యేసు చేస్తున్నది అదే. “నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.”

మరో మాటలో చెప్పాలంటే, నేను బయటికి వచ్చే మార్గాన్ని ఎంచుకోవడం లేదు, ఎందుకంటే నాకు లేఖనాలు తెలుసు. నా ప్రజలు రక్షింపబడాలంటే ఏమి జరగాలో నాకు తెలుసు. దేవుని వాక్యంలో నా గురించి ముందుగా చెప్పబడినవన్నీ నెరవేర్చడమే నా నిర్ణయం. నేను వేసే ప్రతి అడుగులో నా ప్రజలమీద అత్యంత ప్రేమ చూపడమే నా నిర్ణయం. మరియు వారు నా ప్రేమను అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. పూర్తి భద్రత, స్వేచ్ఛతో మరియు లోకమునకు పూర్తి భిన్నంగా జీవించండి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *