నేడు చేయవలసిన వాటి కోసం కావాల్సిన శక్తి

షేర్ చెయ్యండి:

వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. (ఫిలిప్పీ 2:12-13)

దేవుడే నిర్ణయాత్మకంగా తన పనిని జరిగించువాడు. మీ సొంతరక్షణను కొనసాగించండి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవుడు తన దయా సంకల్పం నెరవేరాలనే ఆయన తన చిత్తాన్ని కలిగి, కార్యం జరిగిస్తూ ఉంటాడు. అయితే, ఈ విషయాన్ని నమ్మినంత మాత్రాన క్రైస్తవులు ఏ పని చేయకుండా ఉండాలని కాదు గాని ఈ మాటను నమ్మడం ద్వారా వారు మరింత ఎక్కువగా నిరీక్షణ, శక్తి, ధైర్యము కలిగి ఉంటారు.

ప్రతి రోజు మనం చేసేటువంటి ప్రత్యేకమైన సేవలో ఏదో ఒక పని జరిగి తీరాలి. ఆ పనినే చేయాలని పౌలు మనల్ని ఆదేశిస్తున్నాడు. అయితే, ఆ పనిని దేవుడు అనుగ్రహించే శక్తినిబట్టి ఎలా చేయాలో ఆయన మనకు చెప్తున్నాడు, ఎలాగంటే ఆయన్ని నమ్మడం ద్వారానే! దేవుని దయా సంకల్పం నెరవేరుటకై మీరు ఇచ్చయించుటకు మరియు కార్య సిద్ధి కలుగజేయుటకు ఈ రోజున ఆయన మీలో పని చేస్తున్నాడనే వాగ్దానాన్ని నమ్మండి.

దేవుడే ప్రతి క్షణం కృపాపూర్ణుడై పనిచేస్తూ, భవిష్యత్తు కృపకు సంబంధించిన వాగ్దానాన్ని మన ప్రస్తుత అనుభవంలోకి తీసుకువస్తాడు. మన స్వంత రక్షణను ఎలా కొనసాగించుకోవాలో అనే దాని గురించి పౌలు వివరి౦చేటప్పుడు పౌలు తాను గతంలో అనుభవించిన కృప కోసం కృతజ్ఞతను తెలుపుటను గురించి ఆయన దృష్టి పెట్టలేదు. చాలామ౦ది క్రైస్తవులు తాము చూపిస్తున్న విధేయతకు ఉద్దేశమేమిటని అడిగినప్పుడు, వారు కృతజ్ఞతతో విధేయత చూపుతున్నామని చెబుతారు కాబట్టి నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను. అయితే, మన ప్రేరణ మరియు శక్తి గురి౦చి పౌలు మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పడ౦ లేదు. భవిష్యత్తులో దేవుడు చేయబోయే పనిలో తనకున్న విశ్వాసం మీదనే పౌలు దృష్టి పెడుతున్నాడు గాని, అప్పటికే దేవుడు చేసిన పని మీద దృష్టి పెట్టడం లేదు. మీ రక్షణను కొనసాగించుకోండి! ఎందుకు కొనసాగించుకోవాలి? ఎలా కొనసాగించుకోవాలి? ఎందుకంటే ప్రతి ఒక్కొక్క క్షణానికీ దేవుని నుండి కృప అనుగ్రహించబడుతుంది. మీరు సేవను జరిగించాలని ఇష్టపడి, చేయాలనుకున్న ప్రతిసారి ఆయన మీ ఇష్టంలోను, మీరు చేయదలచిన ప్రతి కార్యములోను ఆయన పనిని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటను రాబోయే గంటలో మరియు రాబోయే వేయి సంవత్సరాలలో వచ్చే సవాళ్ల కోసం నమ్మండి.

భవిష్యత్తుకు సంబంధించిన శక్తి ఏంటంటే మనం ప్రవేశించే భవిష్యత్తులోని ప్రతి క్షణములో మన కోసం పని చేయడానికి ఎల్లప్పుడూ ఉండేటువంటి సజీవుడైన క్రీస్తు యొక్క శక్తియే. అందుచేత, పౌలు తనతోపాటు ఉన్నటువంటి దేవుని కృపా ప్రభావాన్ని వివరించినప్పుడు,  “అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను….” (రోమా 15:18) అని చెప్తున్నాడు.

అందుచేత, పౌలు తన పరిచర్య ద్వారా క్రీస్తు చేయించిన వాటిని తప్ప మరి దేని గురించి ఆయన మాటలాడ తెగింపలేదు గాని వాస్తవానికి ఆయన తన పరిచర్య ద్వారా కృప జరిగించిన ప్రతి దానిని గురించి ఆయన మాట్లాడాడు (1 కొరింథీ 15:10), ఈ మాటకు, కృపా శక్తి అంటే క్రీస్తు శక్తియే.

అంటే, రాబోయే ఐదు నిమిషాలకు, రాబోయే ఐదు దశాబ్దాలకు మనకు అవసరమైన శక్తిని మన కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే  సర్వశక్తిమంతుడైన క్రీస్తు అనుగ్రహించే భవిష్యత్తు కృప అన్నమాట, అంటే మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే అన్నమాట. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...