విధేయత బాధ కలిగించినప్పుడు ఎలా భరించాలి?

షేర్ చెయ్యండి:

“విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు … ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించియున్నాడు”. (హెబ్రీయులు 12:2)

విశ్వాసం చేసేది కొన్నిసార్లు చెప్పలేనంత కష్టం.

ఎర్నెస్ట్ గోర్డాన్ తాను వ్రాసిన పుస్తకం “మిరాకిల్ ఆన్ ది రివర్ క్వాయ్‌”లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బర్మా రైల్వేలో పని చేస్తున్న యుద్దఖైదీల సమూహం యొక్క నిజమైన కథను చెప్పాడు.

ప్రతి రోజు చివరిలో పని చేసే ప్రాంతం నుండి ఉపకరణాలు సేకరించబడ్డాయి. ఒక సందర్భంలో ఒక జపాన్ గార్డ్ పార అనే పనిముట్టు తప్పిపోయిందని అరిచాడు మరియు దానిని ఏ వ్యక్తి తీసుకున్నాడో చెప్పమని డిమాండ్ చేశాడు. అతను విరుచుకుపడటం ప్రారంభించాడు, కోపంతో దోషులు ఎవరైనా ముందుకు సాగాలని ఆదేశించాడు. ఎవరూ కదలలేదు. “అందరూ చనిపోతారు! అందరూ చనిపోతారు! ” అతను కేకలు వేస్తూ, ఖైదీల వైపు తన రైఫిల్‌ని గురిపెట్టాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు మరియు గార్డ్ అతనిని తన రైఫిల్‌తో కొట్టి చంపాడు, అతను శ్రద్ధగా మౌనంగా నిలబడి ఉన్నాడు. వారు శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు, పనిముట్లు మళ్లీ లెక్కించబడ్డాయి మరియు పార ఉంది.

మీరు నిర్దోషిగా ఉన్నప్పుడు ఇతరుల కోసం చనిపోవాలనే సంకల్పాన్ని ఏది నిలబెట్టగలదు? “ఆయన యెదుట ఉంచబడిన ఆనందము” మనపట్ల ఆయనకున్న ప్రేమను నిలబెట్టింది. అద్భుతమైన భవిష్యత్ ఆశీర్వాదం మీద మరియు ఆనందం మీద తను ఆధారపడ్డాడు మరియు అది ఆయన కష్టాలలో కూడా ప్రేమను  కొనసాగించేలా చేసింది.

మన ముందు ఉంచబడిన ఆనందం కంటే ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశ్యం, తీవ్రమైన, ఖరీదైన విధేయత కొరకు మనల్ని ప్రేరేపిస్తుంది లేదా బలపరుస్తుంది అని మనం అనుకుంటే, మనకు శ్రమ. ఈ జీవితంలో త్యాగం చేయాల్సిన ఖరీదైన విధేయత కోసం యేసు పిలుపునిచ్చినప్పుడు, లూకా 14:14లో ఇలా అన్నాడు, “నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.” మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు కొరకు మీరు పొందే నష్టాలన్నిటిలో మీ ముందు ఉంచబడిన ఆనందమును బట్టి  బలపరచబడండి.

యేసు ప్రతీకారం తీర్చుకోకుండా బాధపడినప్పుడు, ఆయన మనము అనుసరించడానికి ఒక ఉదాహరణను వదిలివేస్తున్నాడని పేతురు చెప్పాడు. మరియు యేసు తన ముందు ఉంచిన ఆనందంపై కలిగి ఉన్న విశ్వాసం కూడా అందులో ఒక బాగమే. ఆయన తన కారణాన్ని దేవునికి అప్పగించాడు (1 పేతురు 2:21) మరియు ప్రతీకారంతో లెక్కలు తేల్చడానికి ప్రయత్నించలేదు. ఆయన పునరుత్థానం మరియు తన తండ్రితో పునఃకలయిక మరియు ఆయన ప్రజల విమోచనం యొక్క అన్ని ఆనందాలపై తన నిరీక్షణను ఉంచాడు. మనం కూడా అలాగే ఉండాలి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...