చివరిక్షణంలో విడుదల

చివరిక్షణంలో విడుదల

షేర్ చెయ్యండి:

యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.” (లూకా 23:42)

మార్పు కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నించారు కానీ విజయవంతం కాలేదు. ఇది మీకున్న ఆశలన్నింటినీ చంపేస్తుంది.

మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి: ఏమి ఉపయోగం? ఇప్పడు ఒకవేళ విజయాన్ని సాధించినప్పటికీ, నేను  జీవించడానికి ఇంకా చాలా తక్కువ సమయం మిగిలి ఉంటుందని దీనిని చాలా సంవత్సరాల వైఫల్యంతో పోలిస్తే పెద్ద తేడా ఉండదు.

మాజీ దొంగ (యేసు పక్కన సిలువపై ఉన్న దొంగ) మారు మనస్సు పొందిన తర్వాత సుమారు ఒక గంట బ్రతికున్నాడు. తరువాత అతను మరణించాడు. అతను మార్చబడ్డాడు. నూతన వైఖరి కలిగి నూతన కార్యాలను చేస్తూ నూతన వ్యక్తిగా సిలువపై జీవించాడు అంటే దూషించడం ఆపివేశాడు. కానీ అతని జీవితం అప్పటికే 99.99% వృధా అయిపోయింది. అయితే నూతన వ్యక్తిగా జీవించిన చివరి కొన్ని గంటలు ఏమైనా ఉపయోగమా?

అవును ఆ దొంగ  జీవితానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దొంగ, మనందరిలాగే, తన జీవితాన్ని గూర్చి లెక్క అప్పజెప్పటానికి క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడతాడు. “ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మన మందరమును  క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము అవుతాము(2 కొరింథీ 5:10). నూతన జన్మను గూర్చి మరియు క్రీస్తుతో ఐక్యతనుగూర్చి ఆ రోజు అతని జీవితం ఏమి సాక్ష్యమిస్తుంది? అతని జీవితం క్రీస్తులో తన నూతనత్వాన్ని ఎలా నిర్ధారిస్తుంది?

చివరి ఘడియలలో ఏమి జరిగిందో ఆలోచిస్తే ఆ వ్యక్తి కథ మనకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి కొత్తగా ప్రభువుని నమ్ముకున్నాడు. అతని విశ్వాసం నిజమైనది. అతను నిజంగా క్రీస్తుతో ఏకమై ఉన్నాడు. క్రీస్తు నీతి అతని సొంతమైంది. అతని పాపాలు క్షమించబడ్డాయి.

ఈ ఆఖరి క్షణాలలో జరిగిందే తీర్పులో ఉపయోగపడుతుంది. అతను మారిపోయాడు! మరియు అతని మార్పు ప్రాముఖ్యమైనది. దేవుని కృప ఎంత శక్తివంతమైనదో, అతని విశ్వాసం, క్రీస్తుతో అతని ఐక్యత ఎంత వాస్తవమైనవో అనడానికి  గతంలోనూ భవిష్యత్‌లోనూ ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం.

మార్పు చెందడం ఎంత కష్టమో అనే అంశం గురించి ఆలోచిద్దాం. మార్పు కోసం పోరాడుతున్న విశ్వాసులు ఇంకో ప్రక్కనున్నదొంగ వలె రక్షించబడలేదని నేను చెప్పడం లేదు. జీవితం యొక్క చివరి సంవత్సరాలు మరియు చివరి గంటలు ముఖ్యమైనవి అని నేను చెబుతున్నాను.

మన జీవితాలలో చిట్ట చివరి ఘడియల్లో నైనా, కొన్ని దీర్ఘకాల పాపపు అలవాట్లపై లేదా మన వ్యక్తిత్వంలోని హానికరమైన లోపాలపై విజయం సాధించగలిగితే, దేవుని కృప యొక్క శక్తికి అవి అద్భుతమైన సాక్ష్యంగా ఉంటాయి; మరియు అవి క్రీస్తుపై మనకున్న విశ్వాసానికి, ఆయనతో మనకున్న ఐక్యతకు చివరి తీర్పులో సాక్ష్యంగా ఉంటాయి.

మీరు పోరాడుతున్నారా అయితే ధైర్యంగా ఉండండి. అడుగుతూ, వెతుకుతూ, తడుతూ ఉండండి. క్రీస్తు వైపు చూస్తూ ఉండండి. చివరి క్షణంలో దొంగను రక్షించడం ద్వారా దేవుడు మహిమను పొందినట్లయితే, మీరు సంవత్సరాలుగా వెతుకుతున్న విడుదల  మీకు ఇవ్వడానికి దేవుడు ఇంతవరకు వేచి వుండడానికి ఖచ్చితంగా అతనికి ఉద్దేశ్యాలు ఉన్నాయి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...