మురికి గుడ్డలు ఇక ఉండవు

షేర్ చెయ్యండి:

“మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతి క్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను”. (యెషయా 64:6)

మనం దేవుని ధర్మశాస్త్రానికి సంబంధించిన ఏ ఒక్క ఆజ్ఞను ఉల్లంఘించిన కూడా ఆయన పరిశుద్ధతకు విరుద్ధంగా పాపం చేసినట్టే. అంతేగాకుండా అది మనల్ని తీర్పుకు బాధ్యులుగా చేస్తుంది. ఎందుక౦టే ఆయన ఏ పాపాన్నైనా సహించలేడు (హబక్కూకు 1:13; యాకోబు 2:10-11). నీతిగా బ్రతకకపోవడం కన్నా, దేవుని దయగల వాగ్దానాలను, ముఖ్యంగా ఆయన ఏదో ఒక రోజున తన ప్రజలకు పరిపూర్ణ నీతిగా ఉ౦డే విమోచకుడిని ఇస్తాడనే నిరీక్షణను విశ్వసించడంలో విఫలమవడమనేది పాత నిబంధనలో ఉన్న వారిని (యెహోవాయే మన నీతి – యిర్మీయా 23:6; 33:16) నాశనానికి గురి చేసింది; ఈ రోజు కూడా మనకు అలాగే వర్తిస్తుంది. ఈ విధంగా రక్షింపబడ్డామని, విధేయతకు ఈ విశ్వాసమే కీలకమని, విధేయతే ఈ విశ్వాసానికి ఆధారమని పాత నిబంధనలోని పరిశుద్ధులకు తెలుసు.

నీతికి ఏదైనా విలువ ఉందంటే అది కేవలం క్రీస్తు నీతి మాత్రమేనని ప్రజలు చెప్పినప్పుడు చాలా తికమకగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, మనం నీతిమంతులుగా ఎంచబడటం అనేది మన నీతి మీద ఆధారపడి ఉండదు, మనకు అనుగ్రహించబడిన క్రీస్తు యొక్క నీతి మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే, దేవునికి ప్రీతికరమైన నీతి మనలో జరగలేదన్నట్లుగా కొన్నిసార్లు ప్రజలు అజాగ్రత్తగా ఉంటారు, అలాగే మానవ నీతినంతటి గురించి అవమానకరంగా మాట్లాడతారు. దీనివల్ల ఉపయోగం లేదు.

వారు తరుచుగా మన నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా, లేక “కలుషితమైన బట్టలాగా” ఉన్నాయని చెప్పేటువంటి యెషయా 64:6 వచనాన్ని ఉదహరిస్తుంటారు.

అయితే సందర్భాన్ని గమనిస్తే, దేవుని ప్రజలు చేసే ప్రతి నీతి క్రియ దేవునికి అంగీకారయోగ్యం కాదని యెషయా 64:6వ వచనం చెప్పట్లేదు. వాస్తవానికి యెషయా భక్తుడు వేషధారి ప్రజల నీతిని సూచిస్తున్నాడు. అది ఎన్నటికీ నీతి అనిపించుకోదు గాని ఈ వచనానికి ముందున్న వచనంలో అంటే యెషయా 64:5వ వచనంలో “నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించుచున్నావు” అని యెషయా భక్తుడు చెప్తున్నాడు.

క్రీస్తు యొక్క పరిపూర్ణ నీతి మనకు ఆపాదించబడకపోతే క్రీస్తు సిలువ వేయబడక ముందున్న ప్రజలు గానీ లేక క్రీస్తు సిలువ వేయబడిన తరువాత ఉన్న దేవుని ప్రజలు గానీ నిష్కల్మషమైన పరిశుద్ధ దేవునిచేత అంగీకరించబడరనేది నిజం, ఇదెంతో మహిమాన్వితమైన సత్యం (రోమీ. 5:19; 1 కొరింథీ 1:30; 2 కొరింథీ 5:21). అయితే దేవుడు ఆ “నీతిమంతులుగా తీర్చబడిన” ప్రజలలో “మురికి గుడ్డ” కానటువంటి (అది ఇంకా పరిపూర్ణమైనది కానప్పటికీ) నీతిని కలుగజేయడని కాదు.  

వాస్తవానికి, ఆయన అటువంటి నీతిని కలుగజేస్తాడు. ఈ నీతి దేవునికి అమూల్యమైనది మరియు వాస్తవానికి, ఈ నీతి చాలా అవసరం; అంటే మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడేందుకు ఇది పునాది కాదు (క్రీస్తు యొక్క నీతి మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది); మనం నిజంగా నీతిమంతులుగా ఎంచబడిన దేవుని బిడ్డలమనడానికి ఆధారంగా ఆ నీతి అవసరం. దీని కోసమే పౌలు ప్రార్థించాడు. మన౦ కూడా దీని కోస౦ ప్రార్థి౦చాలి. ఆయన ఫిలిప్పీ 1:10-11 వచనాలలో, “మీరు శ్రేప్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు … ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతి ఫలములతో నిండికొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెనని” ప్రార్థిస్తున్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...