కృప యొక్క విభిన్న కోణాలు

కృప యొక్క విభిన్న కోణాలు

షేర్ చెయ్యండి:

అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము. (2 థెస్సలొనీకయులు 1:11–12)

కృప అనేది మనకు అర్హత లేనప్పుడు మనకు మేలు చేయాలనే దేవుని స్వభావం మాత్రమే కాదు – మనం దీనిని “అయోగ్యులకు చూపించే అనుగ్రహం” అని పిలుస్తాము; దేవుని కృప అనేది మన జీవితాలలో పని చేసే దేవుని నుండి వచ్చిన శక్తి మరియు అర్హత లేని మనలో మరియు మన కోసం మంచి విషయాలు జరిగేలా చేస్తుంది.

మంచి నిమిత్తమై తలపెట్టే మన సంకల్పాలను ఆయన “బలముతో” నెరవేరుస్తామని పౌలు చెప్పాడు (12వ వచనం). ఆపై అతను 11వ వచనంలో, “మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున” అని జతచేసాడు. మన జీవితాల్లో క్రీస్తును గొప్ప చేసే విధేయత సాధ్యమయ్యేలా చేయడానికి వాస్తవానికి పనిచేసే శక్తి దేవుని కృపా బలం.

మీరు దీనిని 1 కొరింథీయులు 15:10లో కూడా చూడవచ్చు:

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

కాబట్టి, కృప అనేది క్రియాశీలమైనది, రూపాంతరం జరిగించేది, విధేయతను పెంపొందించే శక్తిగా ఉంది.

కాబట్టి, ఒక సమయంలో దేవుని నుండి మీకు శక్తిని అందించిన ఈ కృప, గతం మరియు భవిష్యత్తు అనే రెండిటికి సంబంధించింది. ఇది ఇప్పటికే మీ కోసం లేదా మీలో ఏదో చేసింది కాబట్టి ఇది గతం. మరియు ఇప్పటి నుండి ఐదు సెకన్లు తరువాత మరియు ఇప్పటి నుండి ఐదు మిలియన్ల సంవత్సరాలు తరువాత, కృప మీలో మరియు మీ కోసం ఏదైనా చేయబోతోంది, కాబట్టి ఇది భవిష్యత్తు.

దేవుని కృప, భవిష్యత్ తరగని కృపా నదిలో నుండి బయలుదేరి వర్తమానంలోని అతి చిన్న కృపా జలపాతం మీదికి ప్రవహిస్తూ గతానికి సంబంధించిన నిరంతరం పెరుగుతూ వస్తున్న కృపా జలాశయం లోనికి వచ్చి చేరుతుంది.

ఉదాహరణకు మరో ఐదు నిమిషాలలో, మీరు  భవిష్యత్తు కాలం లోంచి పారుతూ వస్తున్న నిరంతర కృపను పొందుకుంటారు- దీన్ని మీరు విశ్వసిస్తారు; మీరు గతం యొక్క కృపా జలాశయంలో మరో ఐదు నిమిషాల విలువైన కృపను కూడబెట్టుకుంటారు- దీని నిమిత్తము మీరు కృతజ్ఞత తెలుపుతారు.

భవిష్యత్తు నుండి మనకు వస్తున్న తరగని కృపానది నుండి గతంలో నిరంతరం పెరుగుతున్న కృప యొక్క జలాశయంలోకి దేవుని కృప ఎప్పుడూ వర్తమాన జలపాతంపై ప్రవహిస్తోంది. తదుపరి ఐదు నిమిషాలలో, మీరు భవిష్యత్తు నుండి మీకు ప్రవహించే నిలకడైన కృపను అందుకుంటారు-ఇందులో మీరు విశ్వసిస్తారు; మరియు మీరు గతంలోని జలాశయంలో మరో ఐదు నిమిషాల విలువైన కృపను కూడబెట్టుకుంటారు – దీనికి మీరు కృతజ్ఞతలు తెలుపుతారు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...