సాధారణ విషయాలలో ఆధారపడదగినది

సాధారణ విషయాలలో ఆధారపడదగినది

షేర్ చెయ్యండి:

“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును”. (మత్తయి 6:33)

భవిష్యత్తులో దేవుని కృప యొక్క సర్వ-సమృద్ధికి అత్యంత శక్తివంతమైన సాక్ష్యాలలో ఒకటి చాలా మంది మిషనరీల జీవితాలను, ముఖ్యంగా ఓవర్సీస్ మిషనరీ ఫెలోషిప్ (OMF) జీవితాలను నడిపించిన “విశ్వాస సూత్రం”.

వేరొక పద్ధతిని అనుసరించేవారిని ఖండించకుండా, హడ్సన్ టేలర్ మరియు జార్జ్ ముల్లర్ యొక్క అడుగు జాడలలో నడిచేవారు, ఇవ్వడానికి ముందుకొచ్చే మద్దతుదారుల హృదయాలను కదిలించడానికి వారి అభ్యర్థనలను ప్రజలవైపు కాకుండా దేవునివైపు మళ్లించేవారు.

జేమ్స్ హెచ్. టేలర్, OMF స్థాపకుడి మునిమనవడు, భవిష్యత్ కృపపై ఉంచే ఈ విశ్వాసం, గతించిన కృప యొక్క ప్రదర్శనల మీద ఆధారపడడం ద్వారా, దేవుణ్ణి ఎలా గౌరవిస్తుందో వివరించాడు.

మేము. . . విశ్వాసం నుండి ప్రారంభిస్తాం. దేవుడు ఉన్నాడని నమ్ముతాము. మేము దీనిని వివిధ మార్గాల్లో ఒప్పించబడ్డాము, అయితే యేసుక్రీస్తు ద్వారా మరియు ఆయన ఆత్మ ప్రసాదించిన పునర్జన్మ ద్వారా దేవున్ని తెలుసుకునేలా చేయడంలో మేమమందరం దేవుని కృపను అనుభవించాము. మృతులలోనుండి యేసుక్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన చారిత్రక వాస్తవం ద్వారా ఆయనను విశ్వసించడానికి మాకు మంచి ఆధారాలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము: ఆయన మరణించి తిరిగి లేస్తానని చెప్పి, దానిని చేసిన వ్యక్తి అన్ని విధాలుగా నమ్మదగినవాడని మేము నమ్ముతున్నాము. అందువల్ల మా ఆత్మల శాశ్వతమైన రక్షణ కోసం మాత్రమే కాకుండా, మా రోజువారీ ఆహారం మరియు ఆర్థిక సహాయం కోసం కూడా ఆయనను విశ్వసించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

సర్వము-ప్రసాదించే దేవుని భవిష్యత్తు కృప యొక్క మహిమను ప్రదర్శించే  అద్భుతమైన విశ్వసనీయతకు సంబంధించిన సాక్ష్యాలను OMF ప్రచురిస్తుంది. “విమాన టిక్కెట్లు, భోజనాలు, వైద్య ఖర్చులు మరియు వంద సంవత్సరాలకు పైగా క్రైస్తవుల సమూహము పొందుకున్న సాధారణ మద్దతు వంటి ఇహలోక అవసరాలను దేవుడు ఎలా తీర్చాడో పంచుకోవడం ద్వారా దేవుడు తాను చెప్పేదంతా చేస్తాడని, విశ్వసించడానికి తగినవాడని మేము నిరూపించాలనుకుంటున్నాము.”

OMF దేనికి అంకితం చేయబడింది – వారి సందేశంలో మరియు వారి పద్ధతిలో దేవుని విశ్వసనీయతను మహిమపరచడం. హడ్సన్ టేలర్ ఈ విధంగా చెప్పాడు: “సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయన బైబిల్లో మాట్లాడాడు. ఆయన చెప్పేది నిజం మరియు ఆయన వాగ్దానాలన్నీ చేస్తాడు.

విశ్వాస జీవితాలు దేవుని విశ్వసనీయతకు గొప్ప నిదర్శనం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...