“అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను”. (ఆపొ. కార్య 16:26)
ఈ కాలంలో, దేవుడు తన ప్రజలను కొంతవరకు అపాయం నుండి కాపాడుతున్నాడే గాని సమస్త అపాయం నుండి కాదు. ఆ విషయం తెలుసుకోవడం ద్వారా కాస్త ఊరట కలుగుతుంది, ఎందుకంటే మనం పొందే అపాయం ద్వారా దేవుడు మనల్ని మరచిపోయాడని లేక తిరస్కరించాడని మనం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
అపొ. కార్య 16:19-24 వచనాలలో ఉన్నటువంటి విషయం ద్వారా ప్రోత్సహించబడండి; ఇక్కడ పౌలు మరియు సీలలు బంధకాల నుండి విడిపించబడలేకపోయారు, అయితే 25-26 వచనాలలో వారు విడుదల పొందుకున్నారు.
మొదటిగా, విడుదల లేదు:
- “పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిరి.” (19వ వచనం)
- “న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసిరి.” (22వ వచనం)
- “వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి…” (23వ వచనం)
- “అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.” (24వ వచనం)
వీటన్నిటి తర్వాత విడుదల లభించింది:
అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. (25-26 వచనాలు)
దేవుడు త్వరగానే జోక్యం చేసుకొని ఉండాల్సింది. కానీ ఆయన జోక్యం చేసుకోలేదు. ఆయనకుండే కారణాలు ఆయనకుంటాయి. ఆయన పౌలు, సీలను ప్రేమిస్తున్నాడు.
ఇప్పుడు మీకొక ప్రశ్న: పౌలు ప్రారంభంలో పొందుకున్న శ్రమలు, ఆ తర్వాత విడుదలను పొందినట్లుగా, మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల గుండా తరుచుగా వెళ్తున్నట్లయితే, మీ స్థితి ఏమిటి? మీరు విడుదల పొందని స్థితిలో ఉన్నారా, లేక తలుపులు విశాలముగా తెరువబడిన స్థితిలో ఉన్నారా?
ఆ రెండు స్థితులు, మిమ్మల్ని కాచికాపాడే దేవుడి వేదికలే. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు (హెబ్రీ 13:5).
మీరు బంధకాలలో ఉన్నట్లయితే, నిరాశ చెందవద్దు. పాటలు పాడండి. విడుదల దగ్గరలోనే ఉంది. ఈ బంధకాలు కేవలం కొంతకాలం మాత్రమే. ఆ విడుదల మరణం ద్వారా కూడా రావచ్చు. “మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను” (ప్రకటన 2:10).