కొట్టుకొనిపోవడంలో ఉండే ప్రమాదం

కొట్టుకొనిపోవడంలో ఉండే ప్రమాదం

షేర్ చెయ్యండి:

“కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను”. (హెబ్రీ 2:1)

ఇటువంటి వ్యక్తులను గూర్చి మనందరికీ తెలుసు. ఏదీ అత్యవసరమని అనుకోరు. ఏ విషయంలో కూడా అప్రమత్తతగా ఉండరు. ఏకాగ్రతతో వినడం గాని, యేసువైపు చూడటం గాని  లేదా ఆయనను గూర్చి ఆలోచించడం గాని చేయరు. దాని ఫలితంగా  స్థిరంగా లేకుండా కొట్టుకొనిపోతున్నారు. 

ఇక్కడ విషయం ఏంటంటే: స్థిరంగా నిలబడటం లేదు. ఈ లోక జీవితం కేవలం ఒక సరస్సు కాదు. ఇది ఒక పెద్ద నది. మరియు అది నాశనానికి క్రిందికి ప్రవహిస్తోంది. మీరు యేసు చెప్పేది శ్రద్ధగా విని, ప్రతిరోజూ ఆయనను పరిగణలోకి తీసుకుని, గంటకోసారి ఆయనపై దృష్టి పెట్టకపోతే, మీరు నిశ్చలంగా నిలబడరు; మీరు వెనుకకు వెళ్తారు. మీరు క్రీస్తు నుండి దూరంగా కొట్టుకొనిపోతారు.

క్రైస్తవ జీవితంలో కొట్టుకొనిపోవడం మరణకరమైన విషయం. హెబ్రీ 2:1 ప్రకారం దానికి నివారణ ఏదనగా: మీరు విన్నదాని విషయంలో విశేషమైన జాగ్రత్తను కలిగియుండటం. అంటే, దేవుడు తన కుమారుడైన యేసులో ఏమి చెబుతున్నాడో పరిశీలించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో దేవుడు ఏమి చెబుతున్నాడు మరియు ఏమి చేస్తున్నాడు అనేదానిపై మీ దృష్టిని నిలపండి.

ఇది ఈతకొట్టడానికి చేతులను గట్టిగా కొట్టడం లాంటి కష్టతరమైన పనైతే కాదు. పాపపు సంస్కృతికి వ్యతిరేకంగా ఈత కొట్టకుండా మనల్ని నిలువరించే ఏకైక విషయం ప్రవాహంతో వెళ్ళాలనే మన పాపపు కోరికయే.

దేవుడు మనకు కష్టమైన పనిని ఇచ్చాడని ఫిర్యాదు చేయవద్దు. వినండి, ఆలోచించండి, దృష్టిని ఆయన వైపు తిప్పి ఉంచండి — దీన్ని చాలా కష్టమైన పని అని మీరు అనలేరు. నిజానికి, ఇది పనైతే కాదు. మోసపూరిత కోరికల ద్వారా మనం దిగువకు పడిపోకుండా ఉండటానికి యేసులో సంతృప్తి చెందడానికి ఇస్తున్న గంభీరమైన ఆహ్వానం.

మీరు ఈ రోజు కొట్టుకుపోతుంటే, మీకు గుచ్చుకున్నట్లుగా అనిపించడం, మరియు రాబోయే రోజులలో, నెలలలో మరియు సంవత్సరములలో మీరు యేసుపై దృష్టి పెట్టి, ఆయనను గూర్చి ఆలోచించి, ఆయన మాటలను వినాలనే కోరిక పెరగడం మీరు క్రొత్తగా జన్మించారనడానికి నిరీక్షణతో కూడిన ఒక గుర్తు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...