దేవుని విధానంలో సంఘ అభివృద్ధి

దేవుని విధానంలో సంఘ అభివృద్ధి

షేర్ చెయ్యండి:

“శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు”. (రోమా ​​9:8)

పాత నిబంధనలో అబ్రహంను పాస్టర్‌గా ఊహించుకోండి. “నేను నిన్ను ఆశీర్వదించి నీ పరిచర్యను వర్ధిల్లజేయుదును” అని ప్రభువు చెప్పుచున్నాడు. కానీ సంఘం గొడ్రాలయి పిల్లలు లేనిదిగా ఉంది.

అబ్రాహాము ఏమి చేసాడు? ఆయన అతీతమైన దేవుని జోక్యం విషయంలో నిరాశ చెందడం ప్రారంభిస్తాడు. ఆయనకి ముసలితనం వస్తోంది. ఆయన భార్య గొడ్రాలుగా మిగిలిపోయింది. కాబట్టి అతను మానవాతీత ప్రమేయం లేకుండా దేవుడు వాగ్దానం చేసిన కుమారుడిని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను తన భార్య దాసి అయిన హాగరుతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు (ఆదికాండము 16:4). అయితే, ఫలితం “వాగ్దాన సంబంధమైన కుమారుడు” కాదు, కానీ “శరీరసంబంధమైన కుమారుడైన” ఇష్మాయేలు.

దేవుడు అబ్రాహామును ఆశ్చర్యపరిచాడు, ” ఆమె [నీ భార్య శారా] వలన నీకు కుమారుని కలుగజేసెదను” (ఆదికాండము 17:16). కాబట్టి “అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా” (ఆదికాండము 17:18). తన సహజమైన, మానవ ప్రయత్నాలే దేవుని వాగ్దాన నెరవేర్పుగా ఉండాలని అతను కోరుకుంటున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, కాదు, “నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును” (ఆదికాండము 17:19).

అయితే శారాకు 90 ఏళ్లు. ఆమె తన జీవితమంతా గొడ్రాలుగా ఉంది మరియు ఇప్పటికే స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను (ఆదికాండము 18:11). అబ్రాహాము వయస్సు 100. వాగ్దాన బిడ్డ కొరకు తనకు ఉన్న ఏకైక ఆశ అద్భుతమైన, అతీతుడైన దేవుడు తన జీవితంలో జోక్యం చేసుకోవడమే.

“వాగ్దాన సంబంధులైన పిల్లలు” అంటే అర్థం ఏమిటంటే – “వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.” (యోహాను 1:13). ఈ లోకంలో దేవుని పిల్లలుగా పరిగణించబడే పిల్లలు మాత్రమే అతీతంగా వాగ్దానం చేసిన పిల్లలు. గలతీ 4:28లో పౌలు ఇలా అంటున్నాడు, “మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.” మీరు “ఆత్మనుబట్టి జన్మించారు,” శరీరమునుబట్టి పుట్టినవాడు కాదు (గలతీ 4:29).

అబ్రాహామును మళ్లీ పాస్టర్‌గా భావించండి. దేవుడు వాగ్దానం చేసిన విధంగా అతని సంఘం వృద్ధి చెందడం లేదు. అతీతుడైన వాని జోక్యానికి ఎదురుచూస్తూ విసిగిపోయాడు. అతను కేవలం మానవ పనిముట్టు అయిన “హాగరు” వైపు తిరుగుతాడు మరియు మానవాతీతమైన  పరిశుద్ధాత్ముని పని లేకుండా అతను “ప్రజలను ఆకర్షించగలడు” అని నిర్ణయించుకుంటాడు.అయితే, ఇది ఇస్సాకుల సంఘం కాదు, కానీ ఇష్మాయేలీయుల సంఘం  – శరీరపు పిల్లలే గాని దేవుని పిల్లలు కాదు. దేవుడు ఇలాంటి ఘోరమైన విజయం నుండి మమ్మల్ని రక్షించు. అన్ని విధాలుగా పనిచేయు. కానీ ఎల్లప్పుడూ నిర్ణయాత్మకమైన, మానవాతీతమైన  పని కోసం ప్రభువు వైపు చూడండి. “యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.” (సామెతలు 21:31).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...