క్రిస్మస్ స్వేచ్ఛ కోసమే!

షేర్ చెయ్యండి:

“కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను”. (హెబ్రీయులు 2:14-15)

యేసు మనిషిగా మారాడు, ఎందుకంటే ఒక మనిషి మరణం అవసరం అయింది, కానీ ఆ మనిషి సాధారణ మనిషి కంటే ఎక్కువై వుండాలి. దేవుడు తనను తాను మరణశిక్షలో బంధించుకోవడమే శరీర అవతారం.

క్రీస్తు, మరణాన్ని ముప్పుగా స్వీకరించలేదు. ఆయన మరణాన్ని ఎంచుకున్నాడు. ఆయన దానిని ఆహ్వానించాడు. అందుకే ఆయన వచ్చాడు: “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.” (మార్కు 10:45).

అరణ్యంలో (మత్తయి 4:1-11) మరియు పేతురు నోటి ద్వారా (మత్తయి 16:21-23) – సాతాను క్రీస్తును ఆ సిలువకు చేరకుండా ఆపడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు! సిలువ సాతాను యొక్క నాశనం. యేసు వాడిని ఎలా నాశనం చేశాడు?

హెబ్రీయులు 2:14 సాతాను “మరణముయొక్క బలముగలవాడు” అని చెబుతోంది. అంటే మరణం ద్వారా  భయపెట్టే సామర్థ్యం సాతానుకు ఉంది. “మరణం యొక్క బలము” అనేది మరణ భయం ద్వారా మనుషులను బంధకాలలో ఉంచే శక్తి. అది మనుష్యులను పాపంలో ఉంచే శక్తి కాబట్టి మరణం భయంకరమైనది.

కానీ యేసు సాతానుకున్న ఈ శక్తిని తొలగించాడు. వాడిని నిరాయుధులనుగా చేశాడు. ఆయన మనకు నీతి అనే కవచాన్ని తయారు చేసి ఇచ్చాడు, ఇది సాతాను నిందల నుంచి మనకు రక్షణగా నిలుస్తుంది. అయితే, యేసు ఇది ఎలా సాధించాడు?

తన మరణం ద్వారా యేసు మన పాపాలన్నింటినీ తుడిచిపెట్టాడు. పాపం లేని వ్యక్తిని సాతాను ఖండించలేడు. క్షమించబడిన మనల్ని అంతిమంగా నాశనం చేయలేడు. దేవుని స్వంత న్యాయస్థానంలో దేవుని అనుచరులను నిందించడం ద్వారా దేవుని పాలనను నాశనం చేయాలనేది సాతాను ప్రణాళిక. కానీ ఇప్పుడు, క్రీస్తు యేసు నందు ఏ శిక్షావిధియు లేదు. సాతాను చేసిన ద్రోహం విఫలమైంది. అతని విశ్వద్రోహం అడ్డుకోబడింది. “వాడి  కోపాన్ని మనం భరించగలము, ఎందుకంటే, వాడి వినాశనం ఖచ్చితంగా ఉంది.” సిలువ వాడి హృదయాన్ని చీల్చింది. మరియు ఎక్కువ కాలం పట్టకముందే వాడు చివరి శ్వాస తీసుకుంటాడు.

క్రిస్మస్ అనేది మన స్వేచ్ఛ కోసమే. మరణ భయం నుండి విముక్తి కోసమే.

యేసు, బెత్లెహేములో మన స్వభావాన్ని తీసుకున్నాడు. యెరూషలేంలో మన మరణాన్ని ఆయన మరణించాడు. ఈ రోజు మనం మన నగరంలో నిర్భయంగా ఉండవచ్చు. అవును, నిర్భయంగానే. ఎందుకంటే నా ఆనందానికి అడ్డుగా ఉన్న అతి పెద్ద ముప్పు పోయినట్లయితే, నేను చిన్నచిన్న వాటి గురించి ఎందుకు బాధపడాలి? మీరు  (నిజంగా!) ఇలా ఎలా చెప్పగలరు, “సరే, నేను చనిపోవడానికి భయపడను కానీ నా ఉద్యోగం కోల్పోతానని భయపడుతున్నాను”? కానే కాదు. ఆలోచించండి!

మరణం (నేను చెప్పాను, మరణం! – నాడీ లేదు, చల్లబడింది, వెళ్లిపోయింది!) ఇకపై భయం కానట్లయితే, మనం స్వేచ్ఛగా, నిజంగా స్వేచ్ఛగా ఉన్నాము. క్రీస్తు కోసం మరియు ప్రేమ కోసం సూర్యుని క్రింద ఎలాంటిదైనా తెగింపుతో ఎదురెల్లవచ్చు.  ఆందోళనకు ఇక బానిస అవ్వాల్సిన పనిలేదు.కుమారుడు మిమ్మల్ని విడిపించినట్లయితే, మీరు నిజంగా విడుదల పొందిన వారే!

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...