“సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను”. (లూకా 22:31-32)
వాస్తవానికి, పేతురు యేసును మూడుసార్లు తిరస్కరి౦చడ౦ ద్వారా ఘోరంగా విఫలమైనప్పటికీ, యేసు ప్రార్థన, పేతురును పూర్తిగా నాశన౦ ను౦డి కాపాడి౦ది. అతను ఘోరమైన దుఃఖానికి లోనయ్యాడు, గానీ అతడు ఆనందంతోను ధైర్యముతోను నింపబడ్డాడు, దీనిని మనం పెంతెకోస్తు దినాన పేతురు చేసిన ప్రసంగంలోను చూడగలం. ఇదే విధంగా మన విశ్వాసం విఫలం కాకుండా ఉండాలని మన కోసం యేసు విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని పౌలు రోమా 8:34లో చెప్తున్నాడు.
యేసు తన గొర్రెలు భద్రంగా ఉంటాయని, నశించిపోవని వాగ్దానం చేశాడు. “నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు” (యోహాను 10:27-28).
దీనికి కారణం ఏంటంటే గొర్రెల విశ్వాసాన్ని కాపాడడానికి దేవుడు పని చేస్తాడు. “మీలో ఈ సత్ క్రియ నారంభించినవాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పీ 1:6).
విశ్వాస సంబంధమైన పోరాటం మనమే చేయాలని మనం వదిలిపెట్టబడలేదు. “ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీ 2:13).
మీరు ఆయన పిల్లలైతే, మీరు దేవుని వాక్యపు భరోసాను కలిగియున్నారు, “యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక” (హెబ్రీ 13:21).
విశ్వాసములోను, ఆనందంలోను మనకుండే సహనం చివరికి నిర్ణయాత్మకంగా దేవుని చేతిలోనే ఉంటుంది. అవును, మనం తప్పకుండ పోరాటం చేయాలి. అయితే, ఈ పోరాటమే దేవుడు మనలో జరిగించే కార్యం. “ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను” అని రోమా 8:30లో చెప్పబడినట్లుగా ఆయన దీనిని ఖచ్చితంగా జరిగిస్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన దేవుని పిల్లలను మహిమపరచడమనేది ఎంతో మంచి కార్యం.
ఆయన తన విశ్వాసములోనికి నడిపించినవారిని, నీతిమంతులుగా తీర్పు తీర్చినవారిని ఆయన ఎన్నడూ వదులుకోడు.



