క్రీస్తే కారకుడు మరియు ముగింపు
“నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను”. (గలతీ 2:20)
దేవుడు విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? మరియు ఆయన దానిని ఎందుకు పరిపాలిస్తున్నాడు? దేవుడు ఏమి సాధిస్తున్నాడు? ఈ సాధనకు యేసుక్రీస్తు కారకుడా లేక సాధనకు ముగింపా?
యేసుక్రీస్తు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రత్యక్షత. ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడు. అందుకని, ఆయన ముగింపు.
దేవుని మహిమను చూపించడమే విశ్వం ఉనికికి ఉన్న పరమార్థం. దేవుడు సాధించేది ఇదే. ఆకాశములు మరియు ప్రపంచ చరిత్ర “దేవుని మహిమను తెలియజేస్తున్నాయి”.
అయితే చేయవలసిన పనిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు పంపబడ్డాడు. ఆయన మానవ పతనం యొక్క నివారణకు వచ్చాడు. పాపులను వారి పాపం కారణంగా అనివార్యమైన నాశనం నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈ రక్షింపబడినవారు నిత్య సంతోషముతో దేవుని మహిమను చూస్తారు మరియు ఆస్వాదిస్తారు మరియు ప్రదర్శిస్తారు.
మిగిలినవారు దేవుని మహిమను గూర్చి అపహాస్యం చేస్తూనే ఉంటారు. కాబట్టి, తన ప్రజల ఆనందము కొరకు తన మహిమను ప్రత్యక్షపరుచుట ద్వారా దేవుడు ఏమి సాధించాలనుకున్నాడో దానికి యేసుక్రీస్తు కారకుడు. క్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని మినహాయించి ఎవరూ దేవుని మహిమను చూడలేరు, ఆనందించలేరు మరియు స్తుతించలేరు. తద్వారా విశ్వం యొక్క లక్ష్యం ఆగిపోతుంది. క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి క్రీస్తే కారకుడు.
కానీ క్రీస్తు సిలువపై పాపుల కోసం మరణించడం ద్వారా, క్రీస్తు తండ్రి ప్రేమను మరియు నీతిని గొప్పగా వెల్లడిపరిచాడు. ఇది దేవుని మహిమ ప్రత్యక్షత యొక్క శిఖరం – ఆయన కృప యొక్క మహిమయై ఉంది.
కావున, దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చడం కొరకు క్రీస్తు చేసిన పరిపూర్ణ క్రియ ద్వారా కారకుడు అయ్యాడు. అదే సమయంలో, యేసుక్రీస్తు ఆ ఉద్ధేశ్యానికి ముగింపు కూడా అయ్యాడు. క్రీస్తు పాపుల స్థానంలో మరణించి మరియు వారి జీవం కొరకు ఆయన పునరుత్థానం అవ్వడం ద్వారా, దేవుని మహిమ యొక్క ఉన్నతమైన ప్రత్యక్షతకు కేంద్రము అయ్యాడు.
కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తు విశ్వంలో దేవుని ఉద్దేశ్యానికి కారకుడు మరియు ముగింపు. క్రీస్తు సిలువ కార్యానికి వేరుగా, ఆ ముగింపు (దేవుని ప్రజల ఆనందం కోసం దేవుని మహిమ యొక్క సంపూర్ణతను బహిర్గతం చేయడం) జరిగేది కాదు.
మరియు దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చే సాధనలో క్రీస్తు ముగింపు అయ్యాడు –క్రీస్తు మనకొరకు శాపమవడము ద్వారా, దేవుని గూర్చి ఏదైతే ప్రత్యక్షపరిచాడో దానిని మరింత ఎక్కువగా చూస్తూ, ఆస్వాదించుచు నిత్యత్వాన్ని గడుపుతాము. అలా నిత్యత్వాన్ని గడుపుతున్నపుడు మన ఆరాధనలో నిత్యమూ మన గురి క్రీస్తే.
యేసుక్రీస్తు కొరకు సర్వసృష్టి సృజించబడింది. ఆయనే అంతిమ లక్ష్యం. నీతిమంతులగా తీర్చబడిన పాపులు ఆ అంతిమ లక్ష్యము నందు ఆనందించుటకు కారకుడు క్రీస్తే.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web