“అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి”. (మార్కు 14:26)
యేసు పాటలు పాడటం మీరు వినగలరా?
ఆయన స్వరం తక్కువ ఉంటుందా? మధ్యంగా ఉంటుందా? ఆయన స్వరానికి ఝంకారము తక్కువ ఉందా? లేదా కదలని స్పస్టమైన పిచ్ ఉందా?
ఆయన కళ్ళు మూసుకుని తండ్రికి పాడాడా? లేక తన శిష్యుల కళ్లలోకి చూస్తూ వారి లోతైన స్నేహాన్ని చూసి నవ్వుతూ పాడాడా?
ఆయన అలవాటుగా పాటను ప్రారంభించాడా? లేదా పేతురు లేక యాకోబు లేక మత్తయి ప్రారంభించాడా?
ఆహా, యేసు పాడితే వినడానికి చాలా ఆశతో నేను ఎదురు చూస్తున్నాను! ఆయన తన స్వరాన్ని ఎత్తి పాడినట్లయితే విశ్వంలోని గ్రహాలు వాటి వాటి కక్ష్యలను వదిలి బయటకి వచ్చేస్తాయని నేను భావిస్తున్నాను. అయితే కదలనటువంటి రాజ్యం మనకుంది; కాబట్టి, ప్రభువా, ముందుకు సాగండి, పాడండి!
క్రైస్తవ విశ్వాసం కీర్తనలు పాడగలిగే విశ్వాసమే గానీ మరేమీ కాదు. వ్యవస్థాపకుడే కీర్తనలు పాడారు. ఆయన తన తండ్రి నుండి పాడటం నేర్చుకున్నాడు. ఖచ్చితంగా వారు నిత్యత్వం నుండి కలిసి పాడుతున్నారు. మీరు ఇలా అనుకోలేదా? త్రియేక సహవాసంలో అనంతమైన శాశ్వతమైన ఆనందంతో వారు పాటలు పాడలేదా?
మన పాటలు “సంతోషముతో స్వరములెత్తి” (1 దిన 15:16) పాడాలని అని బైబిలు చెబుతోంది. దేవుని కంటే గొప్ప ఆనందం విశ్వంలో ఎవరికీ లేదు. ఆయన అనంతమైన ఆనందాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన పరిపూర్ణతలు తన కుమారుని దైవత్వంలో సంపూర్ణంగా ప్రతిబింబించటాన్ని దృష్టిలో పెట్టుకొని నిత్యమూ ఆనందించువాడు.
దేవుని ఆనందం ఊహించలేనంత శక్తివంతమైనది. ఆయన దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు, గెలాక్సీలు కలిగాయి. ఆయన ఆనందం కోసం పాడినప్పుడు, విశ్వంలోని అన్నింటిలో ఉన్న శక్తి అంతటి కంటే అవి కదులుతూ ఉన్నప్పుడు వచ్చే శక్తి అంతటి కంటే ఎక్కువ శక్తి విడుదల అవుతుంది.
ఆయనను బట్టి మన హృదయములోని ఆనందము బయటకు రావాలని ఆయన మన కోసం పాటను నియమించడానికి కారణం, ఆయన రూపంలో ఉన్న కుమారుని బట్టి ఆయనకున్న ఆనందాన్ని ఆయన ఆత్మతో పాటల ద్వారా వ్యక్తపరిచడంలో ఉన్న ఆనందం ఆయనకు తెలుసు కాబట్టే కదా? మనం పాటలు పాడే దేవుని పిల్లలం కాబట్టి మనం పాటలు పాడే ప్రజలం.