డబ్బు, సెక్స్ మరియు అధికారం కంటే మెరుగైనది
“కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును”. (హెబ్రీ 10:35)
లోకము అందించే వాటన్నిటి కంటే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానము ‘దేవుని గొప్పతనం’. దీనిని మనం లోతుగా ఆలోచించాలి. అలా చేయకపోతే, మనం అందరిలాగే లోకాన్ని ప్రేమిస్తాము మరియు అందరిలాగే జీవిస్తాము.
కాబట్టి, ఈ లోకాన్ని నడిపించే వాటన్నిటికంటే దేవుడు ఎంత ఉన్నతమైనవాడో ఆలోచించండి. డబ్బు లేదా సెక్స్ లేదా అధికారం విషయంలో మరణమును దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మరణం వాటన్నింటినీ దూరం చేస్తుంది. మీరు వాటి కోసం జీవిస్తే, మీకు వచ్చేది ఏముండదు. మీరు పొందేవన్నీ మీరు కోల్పోతారు.
కానీ దేవుని ధననిధి చాలా ఉన్నతమైనది మరియు ఎప్పటికీ నిలిచి ఉండేది. ఇది మరణానికి మించినది. డబ్బు అంతా దేవుని సొత్తు మరియు ఆయన మన తండ్రి గనుక డబ్బు కంటే ఇది ఉత్తమం. మనం ఆయన వారసులం.”సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.” (1 కొరింథీ 3:22-23)
ఇది సెక్స్ కంటే మెరుగైనది. యేసు ఎప్పుడూ లైంగిక సంబంధాలను కలిగి ఉండలేదు. అయినప్పటికీ మానవులందరిలో అత్యంత పరిపూర్ణ మానవుడు యేసే. సెక్స్ అనేది రాబోవు వాస్తవికతకు, సంబంధమునకు, ఆనందమునకు ఒక గొప్ప ప్రతిబింబం. ఎంత గొప్ప లైంగిక సంబంధమైనా ఆ ఆనందము ముందు తక్కువే.
అధికారం కంటే దేవుని బహుమానం గొప్పది. సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డగా ఉండటం కంటే గొప్ప మానవ అధికారం మరొకటి లేదు. “ మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా?” (1 కొరింథీ 6:3). “నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.” (ప్రకటన 3:21)
చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉంటాయి. లోకము అందించే వాటన్నింటి కంటే దేవుడు ఉన్నతమైనవాడు. ఎప్పటికీ నిలిచి ఉండేవాడు.
దేవుణ్ణి దేనితో పోల్చలేము. ప్రతిసారీ దేవుడే గెలుస్తాడు. మన ముందున్న ప్రశ్న: మనము దేవునిని కలిగి ఉన్నామా? మైమరిపించే లోకం అనే మత్తు నుండి మనం మేల్కొంటామా? నిజంగా వాస్తవమైనది, అనంతమైన విలువైనది, శాశ్వతమైనదియుయైన వాటిని చూసి, నమ్మి, ఆనందించి, ప్రేమించ గలుగుతామా?
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web
One comment
ఇది హిత బోధ