జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

రక్షించే విశ్వాసం క్షమాపణను ప్రేమిస్తుంది

“ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి”. (ఎఫెసీ 4:32)  రక్షించే విశ్వాసం అనేది మీరు క్షమించబడ్డారనే విషయాన్ని నమ్మడం మాత్రమే కాకుండా పాపం యొక్క ఘోర స్థితిని చూస్తుంది, ఆ తర్వాత దేవుని పరిశుద్ధతను చూస్తుంది, దేవుని క్షమాపణ వివరించలేనంత మహిమాన్వితమైనదని, అందమైనదని ఆధ్యాత్మికంగా…

నిరాశతో యేసు ఆరు విధాలుగా పోరాడాడు

“పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను”. (మత్తయి 26:37) యేసు సిలువ వేయబడటానికి ముందు రోజు రాత్రి ఆయన ఆత్మ స్థితిని గురి౦చి బైబిలు మనకు అద్భుతమైన విషయాన్ని తెలుపుతోంది. నిరాశకు లేదా ధైర్యం చెడిన స్థితికి విరుద్ధంగా యేసు వ్యూహాత్మకంగా పోరాటం చేసిన విధానాన్ని చూసి, దాని నుండి…

అహంకార క్రియలు, దీన విశ్వాసం

“ఆ దినమందు అనేకులు నన్ను చూచి – ‘ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?’ అని చెప్పుదురు”. (మత్తయి 7:22)  “క్రియలకు” సంబంధించిన హృదయానికి మరియు “విశ్వాస” సంబంధమైన హృదయానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని గమనించండి. క్రియలకు సంబంధించిన హృదయం తన శక్తితో…

విశ్వాసం ద్వారా మనం ఆత్మను అనుభవిస్తాం

“ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?” (గలతీ 3:5) ప్రతి క్రైస్తవునిలో పరిశుద్ధాత్ముడు నివాసమైయున్నాడు. “ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు” (రోమా 8:9) అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. రక్తం ద్వారా కొనబడిన దేవుని వాగ్దానాలను నమ్మినప్పుడే మొట్ట మొదటిసారిగా ఆత్మ దేవుడు…

అపరాధాన్ని, దురాశను, భయాన్ని విశ్వాసం వెళ్ళగొడుతుంది

“ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే”. (1 తిమోతి 1:5)   ఇక్కడ పౌలు ప్రేమను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ గొప్ప ప్రభావానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన ఆధారలన్నిటిలో ఒకానొక ప్రాముఖ్యమైన ఆధారం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసమే. విశ్వాసం అనేది ప్రేమకు ఖచ్చితమైన ఆధారం కావడానికి కారణం ఏంటంటే దేవుని…

సేవ చేయడానికి మిమ్మల్ని ఏది నడిపిస్తుంది? 

“ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును”. (గలతీ 6:8) సాధ్యమైనంతవరకు దేవుని కృపను అనుభవించుటకు విశ్వాసం తీరని ఆకలిని కలిగి ఉంటుంది. కాబట్టి, దేవుని కృప అత్యంత స్వేచ్చగా ప్రవహించే నది వైపుకు, అంటే ప్రేమ నది ప్రవాహం వైపుకు…

సేవ అనేది జీవితం కంటే అతి ప్రాముఖ్యమైనది

“అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు”. (ఆపొ. కార్య 20:24) క్రొత్త నిబంధన ప్రకార౦, క్రైస్తవులందరూ చేసేదే “సేవ (పరిచర్య)”. ఎఫెసీ 4:11-12 ప్రకారం, సేవ కోసం పరిశుద్దులను సంసిద్ధం చేసే పని…

కృప ద్వారానే మన పని చేస్తాం

“అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే”. (1 కొరింథీ 15:10) ఈ వచన౦లో, “వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని” అనే మొదటి భాగాన్ని తప్పుగా అర్థ౦ చేసుకోవచ్చని పౌలు…

నేడు చేయవలసిన వాటి కోసం కావాల్సిన శక్తి

వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. (ఫిలిప్పీ 2:12-13) దేవుడే నిర్ణయాత్మకంగా తన పనిని జరిగించువాడు. మీ సొంతరక్షణను కొనసాగించండి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవుడు తన…

క్రీస్తును ఒప్పుకొనుటకుగల శక్తి

“ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరియందు అధికముగా ఉండెను”. (అపొ. కార్య 4:33)  ఏదో ఒక వ్యతిరేకమైన అపాయకరమైన పరిస్థితిలో మనం చేసే పరిచర్య క్రీస్తుకు సాక్ష్యమివ్వాలనుకుంటే దానికి కావాల్సింది మన తెలివితేటలు కాదు గాని సమృద్ధిగా ఉండే భవిష్యత్తులోని కృప. ప్రజల౦దరిలో పునరుత్థానుడైన క్రీస్తు కోసం…