వీటన్నిటికి కారణం  

వీటన్నిటికి కారణం  

షేర్ చెయ్యండి:

“తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను”. (ఎఫెసీ 1:4-5)

చార్ల్స్ స్పర్జన్ గారి అనుభవం ఏ సాధారణ క్రైస్తవుని సామర్థ్యానికి అతీతమైనది కాదు.

1834 నుండి 1892 వరకు జీవించిన స్పర్జన్, జార్జ్ ముల్లర్ మరియు హడ్సన్ టేలర్ వారి సమకాలీకుడు మరియు వారికి మిత్రుడు. ఆయన లండన్ లోని మెట్రోపాలిటన్ టబర్నకల్ సంఘంలో ప్రఖ్యాతిగాంచిన పాస్టరుగా ముప్పై సంవత్సరాలకంటే ఎక్కువ కాలం సేవ చేశాడు.

ప్రతి వారం ప్రజలందరూ క్రీస్తులోనికి వచ్చే విధంగా ఆయన ప్రసంగం ఎంతో శక్తివంతంగా ఉండేది. ఆయన ప్రసంగాలన్నీ ముద్రించబడి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి, ఆత్మలను గెలిచే మాదరికరమైన వ్యక్తిగా ఆయన పలువురి ద్వారా గుర్తింపు పొందాడు.

తన జీవితంలో మరియు పరిచర్యలో చివరి దినములను రూపకల్పన చేసిన తన పదహారవ ఏట ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు.

నేను క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు ఇదంతా నా అంతటికి నేనే చేసేవాడినని అనుకొనేవాడిని, నేను దేవుణ్ణి మనస్పూర్తిగా వెదికినప్పటికీ, దేవుడే నన్ను వెదుకుతున్నాడనే ఆలోచన నాకుండేది కాదు. ఈ విషయం గురించి క్రొత్తగా మారుమనస్సు పొందిన వ్యక్తికి అవగాహన ఉంటుందని నేను భావించడం లేదు.

నా ఆత్మలో నేను ఆ సత్యాలను [సార్వభౌమాదికారము, జయించే కృప అనే సిద్ధాంతాలు] గ్రహించిన ఆ మొదటి ఘడియను మరియు ఆ రోజును జ్ఞాపకం చేసుకోగలను, అంటే జాన్ బన్యన్ చెప్పినట్లుగా, బాగా అగ్గిలో కాగబెట్టిన ఇనుములా ఆ సత్యాలు నా హృదయంలోనికి కాలిపోయాయి మరియు నేను అకస్మాత్తుగా, ఒక శిశువు స్థాయి నుండి బాగా ఎదిగిన ఒక మనిషి స్థాయి వరకు ఎదిగిన తీరును నేను ఎలా అనుభవించానో, అంటే ఒకేసారి దేవుని సత్యానికి సంబంధించిన ఆధారాన్ని కనుక్కోవడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానంలో నేను పొందిన ప్రగతిని జ్ఞాపకం చేసుకోగలను.

ఒక రాత్రి నేను దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, ప్రసంగీకుని ప్రసంగం గురించి అంత ఎక్కువగా ఆలోచించలేదు, ఎందుకంటే నేను ప్రసంగాన్ని నమ్మలేదు.

నువ్వు క్రైస్తవునిగా ఎలా మారావు? అనే ప్రశ్న నన్ను తాకింది, నేను ప్రభువును వెదికాను. అయితే, ప్రభువును ఎలా వెదికావు?  ఆ క్షణంలో, ఆయనను వెదికేటట్లు ఏదో ఒకటి నా మనస్సును ప్రభావితం చేయకపోతే నేను ఆయనను వెతకలేననే సత్యం నా మనస్సులో వెలిగింది. నేను ప్రార్థించానని అనుకున్నాను గాని నేను ఎలా ప్రార్థించగలిగాను? అని నన్ను నేనే అడుగుకున్నాను. లేఖనాలను చదవడం ద్వారా ప్రార్థించమని నేను ప్రేరేపించబడ్డాను. నేను లేఖనాలను ఎలా చదవగలిగాను? నేను లేఖనాలను చదివాను గాని అలా చదవడానికి నన్ను నడిపించిందేమిటి?

ఆ తర్వాత, ఒక్క క్షణంలో, వీటన్నిటి మధ్య దేవుడున్నాడని, నా విశ్వాసానికి కర్త ఆయనేనని నేను చూశాను. తద్వార, కృపకు సంబంధించిన సిద్ధాంతమంతా నాకు అర్థమైంది మరియు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాన్ని వదల్లేదు. “నేను పొందిన మార్పును పూర్తిగా దేవునికే ఆపాదిస్తున్నాను” అనేటువంటి ఈ నా ఒప్పుకోలును నిరంతరం చేయాలని ఇష్టపడుతున్నాను.

మీ గురించేమిటి? మీరు పొందిన మార్పును పూర్తిగా దేవుని నుండే కలిగిందని ఒప్పుకుంటున్నారా? అన్నిటికి ఆధారం ఆయనేనా? ఇది మిమ్మల్ని ఆయన సార్వభౌమాధికారం మరియు జయం కలిగించే కృపా మహిమను స్తుతించే విధంగా చేస్తోందా?  

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...