దేవుని మహోన్నతమైన ప్రేమ
“తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమా 8:32)
బాధకు ఉండే విధ్వంసకర శక్తిని దేవుడు తొలగిస్తాడు. ఆధునిక జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్ళు మరియు శోధనల మధ్య ఒక క్రైస్తవునిగా మీరు దీనిని తప్పకుండ నమ్మాలి, లేకపొతే మీరు అభివృద్ధి చెందరు, లేక మీరు ఉనికిని కోల్పోవచ్చు.
ఎంతో గొప్ప బాధ, ఎన్నో వైఫల్యాలు మరియు నిరుత్సాహాలు, ఎన్నో వివాదాలు మరియు ఒత్తిళ్ళు ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి ఎదురుదెబ్బను, ప్రతి నిరుత్సాహాన్ని, ప్రతి వివాదాన్ని, ప్రతి ఒత్తిడిని మరియు ప్రతి బాధను తీసుకొని, దాని విధ్వంసక శక్తిని తీసివేసి, దేవునిలో నాకున్న ఆనందాన్ని పెంపోదించడానికి కృషి చేస్తున్నాడని నేను నమ్మకపోతే, నేను ఎక్కడ మలుపు తిరగాలో నాకే తెలియదు.
“కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు” అని 1 కొరింథీ.3:21-23 వచనాలలో పౌలు చెప్పిన అద్భుతమైన మాటలు వినండి. లోకం మనదే. జీవం మనదే. మరణం మనదే. నేను దీనిని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఎన్నుకోబడిన వారి తరపున ఆయన చాలా మహోన్నతంగా పరిపాలిస్తున్నాడు, జీవితకాల విధేయత మరియు పరిచర్యలో మనల్ని ఎదుర్కొనే ప్రతిదీ దేవుని శక్తివంతమైన హస్తంతో అణచివేయబడుతుంది, మన పవిత్రతకు మరియు దేవునిలో మన నిత్య ఆనందానికి సేవకునిగా చేస్తుంది.
దేవుడు మన కోసం ఉన్నట్లయితే, దేవుడు దేవుడైనట్లయితే, మనకు విరుద్ధంగా ఏదీ జయించబడదనేది నిజం. ఆయన తన కుమారుడినే మన కోసం ఇవ్వడానికి వెనుక తీయనప్పుడు, ఆయనతోపాటు మనకు సమస్తాన్ని తప్పకుండ ఇస్తాడు, సమస్తం అంటే లోకం, జీవం, మరణం మరియు ఆయననే మన కోసం ఇస్తాడు.
రోమా. 8:32 అనే ఈ వచనం నాకు చాలా శ్రేష్టమైన స్నేహితుడని చెప్పాలి. దేవుని భవిష్యత్తు కృపకు సంబంధించిన వాగ్దానం అత్యధికంగా ఉంటుంది. అయితే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పునాది: దీనిని నేను పరలోకపు తర్కం (న్యాయం) అని పిలిచాను. సమస్త ఆటంకాలకు వ్యతిరేకంగా నిలబడేందుకు ఇక్కడ ఒక స్థలం ఉంది. దేవుడు తన స్వంత కుమారుని ఇవ్వడానికి వెనుకాడలేదు! అందుచేత! పరలోకపు న్యాయం ఇది! అందుచేత, మన మంచి కోసం పని చేసే సమస్తాన్ని, సమస్త మంచిని మరియు సమస్త చెడును కొనడానికి క్రీస్తు మన కోసం చనిపోయినప్పుడు, ఆయన సమస్తాన్ని మనకివ్వడానికి మరెంతగా ప్రయాసపడుతాడో ఊహించుకోండి!
ఆయన తన కుమారుణ్ణి ప్రేమించినంత ఖచ్చితంగా ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు!

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web