మీరు దేవుడు కానందుకు సంతోషిస్తున్నారా?
“జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి”.(కీర్తన 96:7 )
కీర్తనాకారుడు తన అనుభవంలో నుండి చెప్తున్న మాటలలో ఒక మాట “యెహోవాకు బలము చెల్లించుడి [= ఇవ్వండి].’’ మనం “యెహోవాకు బలాన్ని చెల్లించినప్పుడు” మనం ఏమి చేస్తున్నాం?
మొదట, దేవుని కృపా సహాయంతో, మనం దేవుని వైపు దృష్టి ఉంచినట్లయితే దేవుని బలమును చూడగలుగుతాం. దేవుని బలము మీద లక్ష్యం ఉంచుతాము. తరువాత మనం ఆయన ఎంత గొప్ప బలమైనవాడో ఒప్పుకోగలుగుతాము. మనము దాని విలువకు తగిన గౌరవం ఇస్తున్నాము.
దేవుని బలం అద్భుతమైనదని మనము కనుగొన్నాము. అయితే దేని వలన అద్భుతమని అంటున్నామంటే, ఇది ఒక రకమైన ఆశ్చర్యం వంటిది – “ప్రభువుకు బలాన్ని ఇవ్వండి!” – బలం అతనిది, మనది కాదని మేము నిజంగా సంతోషిస్తున్నాము.”
దేవుడు అపరిమితమైన బలవంతుడు, మరియు మనం కాదు అనే వాస్తవం ద్వారా మనము లోతైన భావనను కలిగియున్నాము. ఈ వాస్తవాన్ని మనము ఇష్టపడుతున్నాము. దేవుని బలాన్ని బట్టి మనం అసూయపడము. మనకి దేవుని శక్తిపై అత్యాశ లేదు. సమస్త బలమూ ఆయనదే అని సంతోషంతో మన హృదయం నిండుకుంటుంది.
మనల్ని మనం మర్చిపోయి మనలోని అణువణువూ దేవుని బలమును తీక్షణంగా చూడడానికి ఆనందిస్తాయి. రేసులో మనల్ని ఓడించిన రన్నర్ విజయోత్సవ వేడుకకు మనము వచ్చినట్లుగా, మనము ఒడిపోయామనే బాధకి బదులుగా అతని శక్తిని మెచ్చుకోవడంలో గొప్ప ఆనందముందని భావిస్తాము.
మనలో మనము అతిశయించడం లేదా మన స్వంతదాని గురించి ఆలోచించడము కాకుండా మన హృదయాలు మన గురించి మర్చిపోయి స్వేచ్ఛగా బయటికి వెళ్లి దేవుని బలమును మెచ్చుకున్నప్పుడు మనం జీవితంలో లోతైన అర్థాన్ని కనుగొంటాము. మనము ఉబ్బి తబ్బిబ్బయ్యే ఒక విషయం కనుగొంటాం: మనం దేవునిగా ఉండకపోవడం, దేవునిగా ఉండాలనే అన్ని ఆలోచనలు లేదా కోరికలను వదులుకోవడమే లోతైన సంతృప్తినిస్తుంది.
దేవుని శక్తిని మనం శ్రద్ధగా గమనించినపుడు, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణం ఇదేనేమో అన్నకనువిప్పు మనలో పెరుగుతుంది: అదేంటంటే మనం దేవుడు కాకపోవడం తద్వారా దేవుని యొక్క దైవత్వాన్ని, బలాన్ని మెచ్చుకోవడం వలన అత్యంత సంతృప్తికరమైన అనుభవాన్ని పొందడమే. అనంతుడైన దేవుణ్ణి మెచ్చుకోవడమే అన్నింటికీ అంతిమమైన, సంతృప్తికరమైన లక్ష్యం అనే శాంతియుతమైన అవగాహన మనలో స్థిరపడుతుంది.
ఏదైనా శక్తి మన నుండి వస్తుందనుకునే చిన్నశోధనైనా అది మనకి వణుకు పుట్టిస్తుంది. దీని నుండి మనలను రక్షించడానికి దేవుడు మనలను బలహీనంగా చేశాడు: “అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” (2 కొరింథీ 4:7)
దేవుని బలమునందు మనకుండాల్సిన శాశ్వతమైన ఉన్నతమైన అతిశయాన్ని మనమీద మనకున్న వ్యర్థమైన అతిశయంతో తొక్కేయకుండా దేవుడు మనలను కాపాడడం దేవుని యొక్క అద్భుతప్రేమ. దేవునిగా ఉండాలని అనుకోకుండా దేవుని వైపు చూస్తే అది ఎంతో గొప్ప ఆనందం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web