“మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను”. (యోహాను 15:11)
దేవుడు పూర్తిగా సార్వభౌమాధికారి.
“మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు” (కీర్తన 115:3).
అందువల్ల, ఆయన నిరాశ చెందడు. అద్భుతమైన విమోచన చరిత్రలో ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి ఆలోచించినప్పుడు, ఆయన తాను చేసిన కార్యాలలో సంతోషిస్తాడు. ఆయన తిరుగులేని సంతోషకరమైన దేవుడు.
ఆయన తనలో తాను కలిగి ఉన్న బలమైన సంతృప్తియే ఆయన సంతోషం. సృష్టికి ముందు, ఆయన తన మహిమ యొక్క ప్రతిరూపమైన తన కుమారునిలో సంతోషించాడు – నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నాను (మత్తయి 3:17). ఆ తరువాత దేవుని ఆనందం సృష్టి మరియు విమోచన పనులలో “బహిరంగంగా” ప్రదర్శించబడుతుంది.
ఈ పనులు దేవుని హృదయాన్ని ఆనందపరుస్తాయి ఎందుకంటే అవి ఆయన మహిమను ప్రతిబింబిస్తాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి (కీర్తనలు 19:1). “యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక.” (కీర్తన 104:31). ఆయన ఆ మహిమను కాపాడుకోవడానికి మరియు ప్రదర్శించడానికి ప్రతిదాన్ని చేస్తాడు, ఎందుకంటే దానిలో ఆయన ఆత్మ ఆనందిస్తాడు.
దేవుని పనులన్నీ ఆయన విమోచించబడిన ప్రజల స్తుతులతో ముగుస్తాయి. “ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి (కీర్తన 150:2). పరిశుద్ధుల ప్రశంసలలో తన శ్రేష్ఠత యొక్క ప్రతిధ్వనులలో ఆయన పొందే ఆనందం తన ఆనందానికి పరాకాష్ట. “గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు. తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు” (కీర్తన 147:10-11).
కానీ మన స్తుతులు దేవుని సంతోషం మాత్రమే కాదు, ఆయన శ్రేష్ఠతకు ప్రతిధ్వని; అది మన అనంతమైన ఆనందం. దేవుని గొప్పతనాన్ని చూడటంలో మరియు ఆస్వాదించడంలో మనకు లభించే పరిపూర్ణ ఆనందమే ఈ స్తుతి. కాబట్టి, దేవుడు మన నుండి స్తుతులను పొందడం మరియు మనము ఆయనలో ఆనందాన్ని పొందడం ఒకే అన్వేషణ. ఇది క్రీస్తులో ఉన్న దేవుని కృపా మహిమకు సంబంధించిన సువార్త యొక్క గొప్ప ఫలితం!



