దూరమవుతామనే భయం

దూరమవుతామనే భయం

షేర్ చెయ్యండి:

“నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది”. (కీర్తన 31:19)

కీర్తన 31:19లోని రెండు ముఖ్యమైన సత్యాలను పరిశీలించండి.

1. ప్రభువు యొక్క మంచితనం

దేవుని యొక్క విశిష్టమైన మంచితనం అనేది ఒకటి ఉంది. అంటే, దేవుడు ప్రజలందరికీ చూపించే సాధారణ మంచితనం అనగా “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేస్తాడు (మత్తయి 5:45), అనేది మాత్రమే కాదు. కానీ కీర్తన చెప్పినట్లుగా, “భయపడేవారి” పట్ల దేవుని విశిష్టమైన మంచితనం కూడా ఉంది.

ఈ మంచితనం కొలవలేనంత అపరిమితంగా ఉంది. దీనికి హద్దులు లేవు. ఇది ఎప్పటికీ ఉంటుంది. ఇది సర్వసమగ్రమైనది. ఆయనకు భయపడే వారికి మాత్రమే ఈ మంచి ఉంది. వారి మంచి కోసం సమస్తం సమకూడి జరుగుతుంది (రోమా ​​8:28). రోమా ​​5:3-5 ప్రకారం వారి బాధలు కూడా లాభంతో నిండి ఉన్నాయి.

కానీ ఆయనకు భయపడని వారు తాత్కాలిక మంచిని పొందుతారు. రోమా ​​2:4-5 ఈ విధంగా వివరిస్తుంది: “దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.” అనుగ్రహైశ్వర్యము. సహనము. దీర్ఘ శాంతము. మంచితనం. కానీ ఈ దేవుని మంచితనం దేవునికి భయపడటానికి బదులు కాఠిన్యమునకు దారితీస్తుంది.

అది మొదటి సత్యం: ప్రభువు మంచితనం.

2. ప్రభువు భయము

దేవుని పట్ల భయము అంటే ఆయన నుండి దూరమవుతామనే భయం. కాబట్టి, దేవుని ఆశ్రయించడమే దేవుని యందు భయభక్తులు కలిగిఉండడం. అందుకే కీర్తన 31:19లో రెండు షరతులు ప్రస్తావించబడ్డాయి – ప్రభువుకు భయపడి ఆయనను ఆశ్రయించడం”. 1. నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది 2. నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.”

అవి విరుద్ధమైనవిగా అనిపిస్తాయి. భయం అంటే మనల్ని దూరం చేసేదిగా మరియు ఆశ్రయం అంటే మనల్ని దగ్గర చేసేదిగా అనిపిస్తుంది. కానీ ఈ భయం పారిపోతామనే భయం అని మనం అర్ధం చేసుకొన్నపుడు – ఆయన నుండి దూరం అవుతామనే భయం – అప్పుడు అవి కలిసి పనిచేస్తాయి.

పరిశుద్దుల గుండెల్లో నిజమైన వణుకు ఉంటుంది. “భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుడి” (ఫిలిప్పీయులకు 2:12). కానీ లోపలకి బలంగా లాగుతున్న మహా సముద్రపు అలల నుండి తన కుమారున్ని రక్షించిన తండ్రిని చూసినప్పుడు ఆ కుమారునికి వణుకు పుడుతుంది. కాబట్టి, దేవుని మంచితనాన్ని బట్టి ఆనందించండి. ఆయన నుండి దూరం అవుతామనే భయమును కలిగియుండండి. ప్రతి పాపం నుండి పారిపోయి ఆయనను ఆశ్రయించండి. “నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.”

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...