ప్రార్థన గురించిన ప్రణాళిక

ప్రార్థన గురించిన ప్రణాళిక

షేర్ చెయ్యండి:

“నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.  మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. . . . మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను”. (యోహాను 15:7–8, 11)

చేసిన ప్రార్థనకు సమాధానంగా మనం ఫలించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి యేసుతో ఫలభరితమైన సహవాసంలో ఉన్న ఆనందాన్ని ప్రార్థన వెంటాడుతుంది. దేవుని పిల్లలు సంతోషకరమైన, ఫలవంతమైన ప్రార్థన అలవాట్లను ఎందుకు కలిగి ఉండరు?

నేను చెప్పేది తప్పు కాకపోతే, ఒక మాట చెబుతాను. మనం ప్రార్ధనను కోరుకోమని కాదు గాని దానికి ప్రణాళిక వేసుకోము. 

మీరు నాలుగు వారాల సెలవు తీసుకోవాలనుకుంటే, మీరు వేసవి కాలము వచ్చిన తరువాత ఒక ఉదయం లేచి, “హే, ఈ రోజు వెళ్దాం!” అని చెప్పరు కదా. మీరు సిద్ధపడి లేరు. ఎక్కడికి వెళ్లాలో మీకు తెలియదు. ఏదీ ప్రణాళిక చేయలేదు.

కానీ మనలో చాలా మంది ప్రార్థనను అలా చూస్తారు. మనము రోజు తర్వాత రోజు లేచి, ప్రార్థన సమయాలు మన జీవితంలో ముఖ్యమైన భాగం కావాలని గ్రహిస్తాము, కానీ వాటి విషయంలో సిద్ధపాటు ఉండదు.

ఎక్కడికి వెళ్లాలో మనకు తెలియదు. ఏదీ ప్రణాళిక చేయలేదు. సమయం లేదు. స్థలం లేదు. ప్రక్రియ లేదు. మరియు ప్రణాళిక లేని ప్రార్థనలు లోతైన, అనుకోని అనుభవాల అద్భుతమైన ప్రయానం కాదని మనందరికీ తెలుసు. ప్రణాళికకు వ్యతిరేకం అదే పాత ప్రయాణం.

మీరు సెలవులు కొరకు ప్రణాళిక చేయకపోతే, మీరు బహుశా ఇంట్లోనే ఉండి టీవీ చూడాల్సి వస్తుందేమో. ఆధ్యాత్మిక జీవితం విషయంలో ప్రణాళిక లేకపోతే, ప్రవాహం అత్యల్ప స్థాయికి పడిపోయినట్లు మనం ఆత్మీయంగా అత్యల్ప స్థాయికి పడిపోతాము. పరుగెట్టాల్సిన పరుగు పందెం ఉంది మరియు పోరాడవలసిన పోరాటం ఉంది. మీరు మీ ప్రార్థన జీవితంలో పునరుద్ధరణ కావాలనుకుంటే, మీరు దానిని చూడటానికి ప్రణాళిక చేసుకోవాలి.

కాబట్టి, నా హెచ్చరిక ఇది: మన ప్రాధాన్యతలను గూర్చి మరియు అందులో ప్రార్థన ఎలా సరిపోతుందో పునరాలోచించడానికి ఈ రోజు సమయాన్ని వెచ్చిద్దాం. కొన్ని కొత్త తీర్మానాలను తీసుకోండి. దేవునితో ఏదైనా కొత్త సాహసం ప్రయత్నించండి. సమయాన్ని పెట్టుకోండి. ఒక స్థలాన్ని అనుకోండి. మీకు మార్గనిర్దేశం చేసేందుకు లేఖనాలలోని కొంత భాగాన్ని ఎంచుకోండి.

బిజీగా ఉన్న రోజుల చేత బలవంతం చేయబడకండి. మనందరికీ మద్య మద్యలో దిద్దుబాట్లు అవసరం. దేవుని మహిమ కోసం మరియు మీ ఆనందం యొక్క సంపూర్ణత కోసం – ఈ రోజును ప్రార్థన వైపుకు మరల్చుకోండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...