“అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు”. (అపొ. కార్య 15:14)

సంఘం యొక్క పని (మిషన్) కోసం ప్రేరేపించడంలో దేవుని నామాన్ని, అంటే దేవుని కీర్తిని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం సాధ్యం కాదు.

అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో నిషిద్ధమైన అపవిత్రమైన జంతువుల దర్శన౦తో అప్పటిదాక పేతురుకున్న ఆలోచన తలకిందులైప్పుడు, తాను అన్యజనులకు, యూదులకు సువార్త ప్రకటించాలని పాఠం నేర్చుకోవడం ద్వారా, యెరూషలేముకు తిరిగి వచ్చి, దేవుడు తన నామ౦ పట్ల కలిగియున్న ఆసక్తిని బట్టే వీటన్నిటికి కారణమని అపొస్తలులకు చెప్పాడు. “యాకోబు ఇట్లనెను – సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలోనుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు” (అపొ. కార్య 15:13-14) అని పేతురు ప్రసంగాన్ని యాకోబు ఇలా సారాంశంగా చెప్పాడు కాబట్టి మనకిది తెలుసు.

దేవుని నామం కోసం ఒక జనమును ఏర్పరచుకోవడం దేవుని ఉద్దేశమేనని పేతురు చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే కొన్ని స౦వత్సరాల క్రిత౦ ప్రభువైన యేసు పేతురుకు మరచిపోలేని పాఠాన్ని నేర్పించాడు.

ధనవంతుడైన ఒక యౌవనుడు యేసుకు దూరమై, ఆయనను వెంబడించడానికి నిరాకరించినప్పుడు, “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి [ఆ ధనవంతుడిలా కాకుండా] గనుక మాకేమి దొరకును” (మత్తయి 19:27) అని పేతురు యేసుతో అనిన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు యేసు ఒక తేలికపాటి గద్దింపుతో, మనుష్య కుమారుని నామం కోసం మీరు జీవించినప్పుడు దానికి మించిన త్యాగము ఉండదని చెప్పడం జరిగింది. “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును” (మత్తయి 19:29) అని ఆయన చెప్పాడు.

ఇక్కడ చెప్పబడిన సత్యం చాలా స్పష్టంగా ఉంది: దేవుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనం నుండి ప్రజలను ఆయన నామము కోసం సమకూర్చాలనే ఉద్దేశంతో సర్వశక్తివంతమైన ఆనందంతో ఆయన ముందుకు కొనసాగుతున్నాడు (ప్రకటన 5:9; 7:9). జనముల మధ్యన ఆయన నామ ప్రసిద్ధి కోసం ఆయన అంతులేని ఉత్సాహాన్ని కలిగియున్నాడు.

అందుచేత, మనకున్న అనురాగ ఆప్యాయతలన్నీ ఆయనకు అనుగుణంగా తీసుకువచ్చినప్పుడు, లోక సంబంధమైన ప్రసిద్ధి, సౌఖ్యాల కోసం మనకుండే దాహాన్ని విడిచిపెట్టి, కేవలం ఆయన నామం కోసం మాత్రమే  ఆయన కలిగియున్న ప్రపంచ ఉద్దేశంలోనికి చేరుతాం, ఆయన నామం పట్ల దేవుని సర్వశక్తివంతమైన నిబద్ధత మన ముందు రెప రెపలాడే జెండాల వలె ఎగురుతూ ఉంటుంది. అనేకమైన శ్రమల గుండా మనం నడవాల్సి వచ్చినా మనం ఓడిపోం (ఆపొ. కార్య 14:22; రోమా 8:35-39). 

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *