నిస్సహాయుల ఆశ్రయం 

నిస్సహాయుల ఆశ్రయం 

షేర్ చెయ్యండి:

“నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది”. (కీర్తన 31:19)

భవిష్యత్ కృపా అనుభవం మనం దేవుని ఆశ్రయిస్తామా లేదా ఆయన సంరక్షణను అనుమానించి ఇతర ఆశ్రయాలకు పరిగెత్తుతామా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

దేవుని ఆశ్రయించిన వారికి, భవిష్యత్ కృప యొక్క వాగ్దానాలు అనేకము మరియు గొప్పవి.

  • ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. (కీర్తన 34:22)
  • ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము. (2 సమూయేలు 22:31)
  • ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. (కీర్తన 2:12)
  • యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును. (నహూము 1:7)

దేవున్ని ఆశ్రయించడం ద్వారా మనం ఏమీ సంపాదించలేము లేదా యోగ్యత పొందలేము. మనం బలహీనులం మరియు రక్షణ అవసరం కాబట్టి దాగుకుంటున్నాం. కానీ దాగడం వలన మనం స్వయం సమృద్ధులము కాలేము.  ఇది మనం నిస్సహాయులమని మరియు దాక్కున్న ప్రదేశము రక్షించే స్థలంగా చూపిస్తుంది.

నేను ఇప్పుడు చూపించిన లేఖనాలలోని వాగ్దానాలన్నింటిలో, దేవుని నుండి పొందే గొప్ప ఆశీర్వాదం యొక్క షరతు ఏమిటంటే మనం ఆయనను ఆశ్రయించడమే. ఇలా చేయడం వలన మనకు యోగ్యత రాదు; ఇది నిరాశ్రయలు అని, బలహీనులు అని, అవసరంలో ఉన్నామని  మరియు విశ్వాసం ఉంచాలని తెలియజేస్తుంది.

నిరాశ అనేది పెత్తనం చేసే స్థితి కాదు లేదా దానికి ఏ అర్హత లేదు; అది దయ కోసం వేడుకుంటుంది మరియు దయ కోసం చూస్తుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...