గొప్ప ప్రతిఫలం
“అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. (మార్కు 10:29–30)
యేసు చెప్పిన ఈ మాటల అర్థం ఏమిటంటే, మీరు చేసే ప్రతి త్యాగానికి ఆయనే ప్రతిఫలం ఇస్తాడు.
- మీరు తల్లి ఆప్యాయతను, శ్రద్ధను వదులుకుంటే, మీరు నిత్యుడైన క్రీస్తు నుండి వంద రెట్లు ఆప్యాయతను, శ్రద్ధను తిరిగి పొందుతారు.
- మీరు సహోదరుని స్నేహాన్ని వదులుకుంటే, మీరు క్రీస్తు యొక్క ప్రేమను, స్నేహాన్ని వంద రెట్లు తిరిగి పొందుతారు.
- మీరు మీ ఇంటిలో ఉన్న అనుభవాన్ని వదులుకుంటే, మీ ప్రభువు ప్రతి ఇంటిని కలిగి ఉన్నారని తెలుసుకోవడం ద్వారా మీకు వంద రెట్లు సౌలభ్యం, భద్రత లభిస్తుంది.
“మీరు ఫలానా త్యాగాలను చేశాను అని ఇంకెప్పుడు చెప్పకోలేని విధంగా నేను మీ కోసం కార్యాలు చేస్తానని, నేను మీ కోసం ఉంటానని వాగ్దానం చేస్తున్నాను” అని కాబోయే మిషనరీలకు యేసు చెప్తున్నాడు.
పేతురు “త్యాగానికి” యేసు వైఖరి ఏమిటి? పేతురు అన్నాడు, “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి” (మార్కు 10:28). యేసు మెచ్చిన “స్వీయ నిరాకరణ” స్ఫూర్తి ఇదేనా? ఇది కాదు, ఎందుకంటే యేసు పేతురును మందలించాడు.
యేసు పేతురుతో ఇలా అన్నాడు, “నేను వందరెట్లు తిరిగి చెల్లించనంతగా ఎవ్వరూ నా కోసం దేనినీ త్యాగం చేయలేరు – అవును, ఒక విధంగా ఈ జీవితంలో చాలా పొందుకుంటారు, రాబోయే యుగంలో నిత్యజీవం గురించి ఇంక చెప్పాల్సిన పని లేదు.”
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web