“వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.. . . . మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము”. (కీర్తన 90:5–6, 12)

నాకు, సంవత్సర ముగింపు అంటే నా ముగింపు లాంటిది. మరియు డిసెంబర్ 31 రాత్రి 11:59 నా మరణ క్షణం లాంటిది.

సంవత్సరంలో 365 రోజులు చిన్న జీవితకాలం లాంటిది. మరియు ఈ ఆఖరి ఘడియల అంతం చాలా దగ్గరలో ఉందని డాక్టర్ నాకు చెప్పిన తర్వాత ఆసుపత్రిలో చివరి రోజుల్లాగా ఉన్నాయి. మరియు ఈ చివరి గంటల్లో, ఈ సంవత్సర జీవితకాలం నా కళ్ళ ముందు అలా గడిచిపోయాయి మరియు నేను అనివార్యమైన ప్రశ్నను ఎదుర్కున్నాను: నేను బాగా జీవించానా? నీతిమంతుడైన న్యాయాధిపతియైన యేసుక్రీస్తు “నమ్మకమైన మంచి దాసుడా” (మత్తయి 25:21) అని అంటాడా?

నా సంవత్సరం ఇలాగే ముగియడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరియు సంవత్సర ముగింపు మీకు కూడా అదే ప్రాముఖ్యతను కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

నేను అదృష్టవంతుడిగా భావించడానికి గల కారణం ఏమిటంటే, నా స్వంత మరణాన్ని రిహార్సల్ చేయడం గొప్ప ప్రయోజనం. మీ జీవితంలోని చివరి సన్నివేశం కోసం సంవత్సరానికి ఒకసారి అభ్యాసం చేయడం గొప్ప ప్రయోజనం. ఇది గొప్ప ప్రయోజనం ఎందుకంటే జనవరి 1 ఉదయం మనలో చాలా మంది ఇప్పటికీ సజీవంగా ఉన్నారని, సరికొత్త జీవితకాలం అంచున ఉన్నారని, మళ్లీ కొత్తగా ప్రారంభించగలుగుతారు.

మరణం రిహార్సల్ ఎందుకంటే, మీ బలహీనతలు ఎక్కడ ఉన్నాయో, మీ సిద్ధపాటు ఎక్కడ తప్పుగా ఉందో మీకు తెలుస్తాయి; మరియు నిజమైన ప్రేక్షకుల ముందు నిజమైన ఆటకు ముందు మారడానికి అవి మీకు సమయాన్ని ఇస్తాయి.

మీలో కొందరికి చనిపోవాలనే ఆలోచన అనేది చాలా అనారోగ్యకరమైన, చాలా దిగులుతో కూడిన, దుఃఖం మరియు బాధతో నిండి ఉండే ఆలోచనగా బావించి, ప్రత్యేకించి సెలవు దినాలలో దానిని మీ మనస్సు నుండి దూరంగా ఉంచడానికి మీరు మీ వంతు కృషి చేస్తారని నేను అనుకుంటాను. అది తెలివితక్కువ పని అని మరియు మీకు మీరే గొప్ప అన్యాయం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. నా స్వంత మరణం గురించి కాలానుగుణంగా ఆలోచించడం కంటే నా జీవితంలో విప్లవాత్మకమైన విషయాలు చాలా తక్కువ ఉన్నాయని నేను కనుగొన్నాను.

ఉత్తమంగా జీవించడం ఎలాగో తెలుసుకోవడానికి మీ హృదయానికి జ్ఞానం ఎలా పొందుతారు? కీర్తనాకారుడు ఈ విదంగా సమాధానమిస్తాడు:

వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును. . . . మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. (కీర్తన 90:5–6, 12)

మీ రోజులను లెక్కించడం అంటే మీ జీవితం చిన్నదని మరియు మీరు త్వరలో చనిపోతారని గుర్తుంచుకోవాలి. గొప్ప జ్ఞానం – గొప్ప, జీవిత-విప్లవాత్మక జ్ఞానం – ఈ విషయాలను కాలానుగుణంగా ఆలోచించడం ద్వారా వస్తుంది.

విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడా లేదా అనేది పౌలు తన జీవితంలో సాధించిన విజయాలను కొలవడానికి ఉపయోగించిన ప్రమాణం. “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.” (2 తిమోతి 4:7- 8) సంవత్సరాంతములో ఇది మన పరీక్షగా ఉండనివ్వండి.గత సంవత్సరంలో మనం విశ్వాసాన్ని కాపాడుకోలేదని తెలుసుకుంటే, ఈ సంవత్సరాంతపు మరణం (బహుశా) కేవలం రిహార్సల్ మాత్రమేనని మరియు మిగిలిన జీవితమంతా విశ్వాసం ఉంచే అవకాశం, వచ్చే సంవత్సరం మనకు ఉందని నాలాగే మీరు సంతోషిస్తారు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *