“మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము”. (రోమా 5:2)

దేవుని మహిమను చూడడమే మన అంతిమ నిరీక్షణ. ” దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.” (రోమా ​​5:2). దేవుడు “తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెడతాడు” (యూదా 24).

“మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల…. తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా ​​9:23). “తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవుడు” (1 థెస్సలొనీకయులు 2:11). “శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు” (తీతు 2:12-13).

యేసు, ఒక వ్యక్తిగా  మరియు తన పనిలో, దేవుని మహిమ యొక్క మానవ జన్మ మరియు అంతిమ ప్రత్యక్షత. “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమును” (హెబ్రీయులు 1:3). “తండ్రీ . . . నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను.” అని యోహాను 17:24లో యేసు ప్రార్థించాడు.

“తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను” (1 పేతురు 5:1). “ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్య్రం పొందుదునను నిరీక్షణకలదై” (రోమా ​​8:21).

“దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.” (1 కొరింథీయులు 2:7). “క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.” (2 కొరింథీయులు 4:17). “ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” (రోమా 8:30).

క్రీస్తు సువార్త ద్వారా దేవుని మహిమను చూడడం మరియు పాలుపంచుకోవడం మన అంతిమ నిరీక్షణ. మన ప్రస్తుత విలువలపై, నిర్ణయాలపై మరియు చర్యలపై ఆ విలువైన నిరీక్షణ, గొప్ప, నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపుతుంది.

దేవుని మహిమను తెలుసుకోండి. దేవుని మహిమను మరియు క్రీస్తు మహిమను అధ్యయనం చేయండి. దేవుని మహిమను వెల్లడి చేసే లోక మహిమను, క్రీస్తు మహిమను వెల్లడించే సువార్త మహిమను అధ్యయనం చేయండి.

అన్ని విషయాలలో మరియు అన్నింటికంటే ఎక్కువగా దేవుని మహిమను ప్రేమించండి.

మీ ఆత్మను అధ్యయనం చేయండి. మీరు మోహింపబడిన మహిమను తెలుసుకోండి మరియు దేవుని మహిమ లేని మహిమలను మీరు ఎందుకు ఇష్టతున్నారో తెలుసుకోండి.

1 సమూయేలు 5:4లోని అన్యమత దాగోను విగ్రహం లాగా ప్రపంచంలోని వైభవాలు ఎలా కూలిపోవాలో తెలుసుకోవడానికి మీ స్వంత ఆత్మను అధ్యయనం చేయండి. దేవుని మహిమ నుండి మిమ్మల్ని దూరం చేసే మహిమలన్నీ ప్రపంచంలోని దేవాలయాల నేలపై దయనీయమైన ముక్కలుగా పగిలిపోనివ్వండి. ఈ ప్రపంచమంతటి కంటే దేవుని మహిమను అత్యధికంగా ప్రేమించండి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *