“అందుకు పిలాతు – నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు – నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను”. (యోహాను 18:37)

ప్రారంభంలో కాకుండా భూమిపై యేసు జీవితంలోని చివరి క్షణాల్లో వచ్చినప్పటికీ ఇది గొప్ప క్రిస్మస్ వచనం.

గమనించండి: యేసు తాను పుట్టాడని మాత్రమే కాదు, ” లోకమునకు వచ్చితిని” అని చెప్పాడు. ఆయన జన్మలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన పుట్టుక తన జీవితానికి ఆరంభం కాదు. ఆయన తొట్టిలో పుట్టకముందే ఉన్నాడు. నజరేయుడైన యేసు యొక్క వ్యక్తిత్వం, గుణం, స్వభావం ఆయన మనిషిగా పుట్టకముందే ఉన్నాయి.

ఈ రహస్యాన్ని వివరించడానికి ఉపయోగించే పదం అవతారం. కేవలం శరీరంగా మాత్రమే కాదు గాని వ్యక్తిగా వచ్చాడు. అయితే యేసు మనిషిగా పుట్టకముందే ఆయన యొక్క ముఖ్యమైన వ్యక్తిత్వం ఉనికిలో ఉంది. ఆయన పుట్టుక కొత్త వ్యక్తిగా రావడం కాదు, అనంతమైన వృద్ధుడు ప్రపంచంలోకి రావడం.

యేసు పుట్టడానికి 700 సంవత్సరాల ముందు మీకా 5:2 ఇలా వ్రాశాడు:

బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.

యేసు జన్మ రహస్యం కేవలం కన్యకకు పుట్టడమే కాదు. ఆ అద్భుతం మరింత గొప్పదానికి సాక్ష్యమివ్వడానికి దేవుడు ఉద్దేశించాడు; అంటే, క్రిస్మస్ సందర్భంగా జన్మించిన పిల్లవాడు “పురాతన కాలము నుండి, శాశ్వతకాలము నుండి” ఉన్న వ్యక్తి.

అందువలన, ఆయన పుట్టుక ఉద్దేశపూర్వకమైనది. ఆయన పుట్టకముందే జన్మించడం గురించి ఆలోచించాడు. ఆయన తండ్రితో కలిసి ఒక ప్రణాళిక రచించారు. మరియు ఆ గొప్ప ప్రణాళికలో భాగంగా ఆయన భూమిపై తన జీవితంలోని చివరి ఘడియలలో ఇలా మాట్లాడాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.” (యోహాను 18:37).

ఆయనే శాశ్వత సత్యం. ఆయన సత్యం మాత్రమే మాట్లాడాడు. ఆయన ప్రేమ అనే గొప్ప సత్యాన్ని ప్రదర్శించాడు. మరియు ఆయన సత్యం నుండి పుట్టిన వారందరినీ తన శాశ్వతమైన కుటుంబంలోకి చేర్చుకుంటున్నాడు. ఇది పురాతన కాలం నుండి ఉన్న ప్రణాళిక.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *