“నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని”. (యోహాను 17:18)

క్రిస్మస్ మిషన్స్​‍కు ఒక నమూనా. మిషన్స్ క్రిస్మస్ యొక్క అద్దం. నేను, నాలాగే మీరు.

ఉదాహరణకు, ప్రమాదం. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కాబట్టి మీకు కూడా. వారు ఆయనపై కుట్ర పన్నారు. కాబట్టి మీకు కూడా. ఆయనకి శాశ్వత ఇల్లు లేదు. కాబట్టి మిమ్మల్ని కూడా. వారు ఆయనపై తప్పుడు కేసులు పెట్టారు. కాబట్టి మీపై కూడా. వారు ఆయనను కొరడాతో కొట్టారు మరియు వెక్కిరించారు. కాబట్టి మిమ్మల్ని కూడా. మూడు సంవత్సరాల పరిచర్య తర్వాత ఆయన మరణించాడు. కాబట్టి మీరు కూడా.

కానీ యేసు తప్పించుకున్న వాటికన్నా ఘోరమైన ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కూడా!!

16వ శతాబ్దం మధ్యకాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ (1506–1552) అనే మిషనరీ, మలక్కాలో (నేటి మలేషియాలో భాగం) ఫాదర్ పెరెజ్‌కు చైనాకు తన మిషన్ వల్ల కలిగే నష్టాల గురించి రాశాడు. అతను ఇలా చెప్పాడు;

అన్ని ప్రమాదాల కన్నా పెద్ద ప్రమాదం దేవుని దయపై నమ్మకం మరియు విశ్వాసాన్ని కోల్పోవడం. . . . ఆయన మీద ఉన్న అపనమ్మకం దేవుని శత్రువులందరూ కలిసి మనపై కలిగించే ఏ విధమైన భౌతికదాడి కన్నా చాలా భయంకరమైన విషయం, ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా దెయ్యాలు లేదా వాటి పరిచారకులు మనల్ని కొంచెం కూడా అడ్డుకోలేరు.

మిషనరీకి ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం మరణం కాదు, దేవుని దయపై అపనమ్మకం. ఆ ప్రమాదాన్ని నివారించినట్లయితే, మిగిలిన అన్ని ప్రమాదాలు తమ పదునును కోల్పోతాయి.

చివరికి దేవుడు ప్రతి బాకును మన చేతిలో రాజదండంగా చేస్తాడు. J.W అలెగ్జాండర్ ఇలా అంటాడు, “ప్రస్తుత మనం అనుభవించే ప్రతి క్షణపు శ్రమకు, కోట్ల యుగాల కీర్తి దయతో తిరిగి చెల్లించబడుతుంది.”

దేవుని మీద అపనమ్మకం ఉంచే ఈ ప్రమాదం నుండి క్రీస్తు తప్పించుకున్నాడు. కావున దేవుడు ఆయనను గొప్పగా హెచ్చించాడు! ఆయనలాగే, మీరు కూడా.క్రిస్మస్ మిషన్స్​‍కు ఒక మాదిరి అని గుర్తుంచుకోండి. నేను, అలాగే మీరు. మరియు ఆ మిషన్ అంటే ప్రమాదం. ఆ గొప్ప ప్రమాదం దేవుని దయపై అపనమ్మకం. దీనికి లొంగిపోతే అన్నీ పోతాయి. ఇక్కడ జయించండి మరియు కోట్ల యుగాల వరకు ఏదీ మీకు హాని కలిగించదు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *