ఊహించదగిన గంభీరమైన రక్షణ

షేర్ చెయ్యండి:

“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు”. (యిర్మీయా 31:31)

దేవుడు నీతిమంతుడు, పవిత్రుడు మరియు మనలాంటి పాపులకి వేరుగా ఉన్నవాడు. క్రిస్మస్ మరియు ప్రతి ఇతర సీజన్‌లో ఇది మన ప్రధాన సమస్య. న్యాయమైన మరియు పవిత్రమైన దేవునితో మనం ఎలా సమాధానపడగలము?

అయినప్పటికీ, దేవుడు దయగలవాడు. యిర్మీయా 31లో (క్రీస్తుకు ఐదు వందల సంవత్సరాల ముందు) ఏదో ఒక రోజు ఆయన కొత్తగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఛాయలను మెస్సీయ అనే వాస్తవంతో భర్తీ చేస్తాడు. మరియు ఆయన శక్తివంతంగా మన జీవితాల్లోకి ప్రవేశించి, మన హృదయాలపై తన చిత్తాన్ని వ్రాస్తాడు, తద్వారా మనం బయటి నుండి నిర్బంధించబడకుండా, లోపల నుండి ఆయనను ప్రేమించటానికి మరియు ఆయనను విశ్వసించి అనుసరించడానికి ఇష్టపడతాము. 

అది ఊహించదగిన గొప్ప రక్షణ – దేవుడు విశ్వంలో ఉన్న అత్యున్నత వాస్తవాన్ని మనకు అనుభవించేందుకు అందించడమే కాకుండా, ఆ వాస్తవాన్ని హృదయపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా అత్యంత స్వేచ్ఛతో, అత్యంత ఆనందంతో దానిని అనుభవించగలిగేలా మనలో పని చేసినట్లయితే, ఇది పాటలతో స్తుతించదగిన క్రిస్మస్ బహుమతిగా ఉంటుంది.

నిజానికి, కొత్త నిబంధనలో ఆయన చేసిన వాగ్దానం అదే. కానీ పెద్ద అడ్డంకి వచ్చింది. మన పాపం. మన దుర్నీతి  వల్ల మనం దేవుని నుండి విడిపోయాము.

పవిత్రమైన మరియు న్యాయమైన దేవుడు విశ్వంలోని గొప్ప వాస్తవాన్ని (ఆయన కుమారుడు) సాధ్యమైనంత గొప్ప ఆనందంతో ఆస్వాదించడానికి పాపులమైన మనతో దయగా ఎలా వ్యవహరించగలుగుతున్నాడు.

సమాధానం ఏమిటంటే, దేవుడు మన పాపాలను తన కుమారునిపై ఉంచి, అక్కడ వాటికి తీర్పుతీర్చాడు, తద్వారా ఆయన వాటిని తన మనస్సు నుండి తొలగించి, మనతో దయగా వ్యవహరిస్తాడు మరియు అదే సమయంలో న్యాయంగా మరియు పవిత్రంగా ఉంటాడు. క్రీస్తు “అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడ్డాడు” అని హెబ్రీ 9:28 చెబుతోంది.

క్రీస్తు చనిపోయినప్పుడు మన పాపాలను తన శరీరంలోనే భరించాడు (1 పేతురు 2:24). ఆయన మన శిక్షను  తీసుకున్నాడు (రోమా ​​8:3). ఆయన మన అపరాధాన్ని రద్దు చేశాడు (రోమా 8:1). అంటే మన పాపాలు పోయాయి (అపొస్తలుల కార్యములు 10:43). మనలను శిక్షించడానికి దేవుని మనస్సులో అవి నిలిచి ఉండవు. ఆ కోణంలో, ఆయన వాటిని “ఎన్నడును జ్ఞాపకము చేసికొనడు”(యిర్మీయా 31:34). అవి క్రీస్తు మరణంలో ఖాళీచేయబడ్డాయి.దేవుడు ఇప్పుడు న్యాయంగా, చెప్పలేనంత గొప్ప కొత్త నిబంధన వాగ్దానాలన్నిటితో మనకు విలాసవంతంగా ఇవ్వడానికి స్వేచ్ఛగా ఉన్నాడని దీనర్థం. ఆయన మనకు క్రీస్తును, విశ్వంలోని గొప్ప వాస్తవాన్ని మనం ఆస్వాదించాలని ఇచ్చాడు. మరియు ఆయన తన స్వంత చిత్తాన్ని – తన స్వంత హృదయాన్ని – మన హృదయాలపై వ్రాస్తాడు, తద్వారా మనం స్వేచ్ఛ మరియు ఆనందంతో అంతరంగములో నుండి క్రీస్తును ప్రేమించగలం, విశ్వసించగలం మరియు అనుసరించగలం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...